Begin typing your search above and press return to search.
గుజరాత్ విషాదం.. ప్రత్యక్ష సాక్షుల కథనమిది!
By: Tupaki Desk | 31 Oct 2022 2:30 PM GMTగుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై ఉన్న వేలాడే వంతెన కుప్పకూలిన ఘటనలో అంతకంతకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదం జరిగినప్పుడు వంతెనపై 500 మందికిపైగా ఉన్నారని తెలుస్తోంది. వంతెన కూలిపోవడంతో వీరిలో ఇప్పటివరకు 141 మంది మరణించినట్టు తేలింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సహాయక చర్యలు ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
కాగా విషాదం జరిగిన ప్రాంతానికి వెళ్లిన మీడియా ప్రతినిధులకు అడుగుడుగునూ విషాదపూరిత దృశ్యాలే కనిపించాయని చెబుతున్నారు. తమ వాళ్లను కోల్పోయి హృదయవిదారకంగా ఏడుస్తున్న యువకులు, చిన్న పిల్లలు, మహిళలు మృతదేహాలు ఇలా మోర్బీ పట్టణమంతా విషాదంతో నిండిపోయింది. ఇప్పటివరకు మరణించిన వారిలో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే కావడం అందరిలోనూ విషాదాన్ని నింపింది.
తాము బ్రిడ్జికి సమీపంలోనే ఉంటామని.. తన తల్లిదండ్రులకు కూలిపనులు చేసుకుంటారని ఓ యువకుడు తెలిపాడు. బ్రిడ్జి కూలినప్పుడు తాను, తన ఆరేళ్ల చెల్లి బ్రిడ్జిపైన ఉన్నామని.. తాను బయటపడ్డా తన ఆరేళ్ల చిట్టి చెల్లెలు కనిపించడం లేదని ఓ యువకుడు రోదిస్తున్న ఘటన అందరినీ కలచి వేసింది. ఘటన జరిగినప్పటి నుంచి తన ఆరేళ్ల చెల్లెలు కోసం వెతుకుతూనే ఉన్నానని.. ప్రభుత్వాస్పత్రితోపాటు చాలాచోట్ల వెతికించినా ప్రయోజనం దక్కలేదని అతడు వాపోయాడు.
కాగా ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ప్రమాదం జరగడం, నదిలో తూటికాడ నిండి ఉండటం, మురుగు నీరు నిండి నీటి లోతు ఎక్కువగా ఉండటంతో నదిలో పడిపోయిన వారిని గుర్తించడం చాలా కష్టంగా మారుతోందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఓ అధికారి తెలిపారు. రాత్రి పూటే లైట్లను ధరించి ఈతగాళ్లు రంగంలోకి దిగినా మృతదేహాలు కనిపించడం లేదని ఆయన వాపోయారు. నీళ్లను తోడేయడం కూడా పెద్ద సమస్య అని తెలిపారు.
జర్నలిస్టుల కథనాల ప్రకారం.. ప్రమాద వార్త తెలిసి తాము అక్కడికి చేరుకునే సరికి బాధితులు పెద్ద ఎత్తున హాహాకారాలు చేస్తున్నారు. అక్కడి దృశ్యాలు భీతావహంగా ఉన్నాయి. బ్రిడ్జి కుప్పకూలడంతో నీటిలో పడిపోయినవారు రెయిలింగ్‌ను పట్టుకుని వేలాడుతూ ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రయత్నించారు. మరికొందరు నదిలో పడిపోయిన బ్రిడ్జి పైభాగాలపైకి ఎక్కి తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే చాలా మంది నీటిలో మునిగి ప్రాణాలు విడిచారు. ఇంకొంతమంది తమను కాపాడాలంటూ అర్థిస్తూ కనిపించారు.
నదిలో నుంచి బయటపడ్డవారు పెద్దగా ఏడుస్తూ నదిలో ఇంకా చాలామంది పడిపోయారని.. వాళ్లందరినీ కాపాడలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు బ్రిడ్జి సమీపంలో ఉంటున్నవారు బ్రిడ్జి కూలడం.. సందర్శకులు హాహాకారాలు చేయడంతో ఏం జరిగిందో తెలియక పెద్ద పెట్టున దూరప్రాంతాలకు పరుగులు దీశారు.
కేబుల్ బ్రిడ్జి ఉన్న ప్రాంతంలోనే నివసిస్తున్న రమేశ్ భాయ్ జిలారియా అనే వ్యక్తి రెయిలింగ్ పట్టుకుని వేలాడుతున్న 60 మందిని తాడు సహాయంతో రక్షించారు. అలాగే 15 మంది మృతదేహాలను బయటకు తీయగలిగారు.
బ్రిడ్జి కూలిన సమయంలో అక్కడే ఉన్న మరో ప్రత్యక్ష సాక్షి సుభాష్ భాయ్ ప్రమాదం జరిగిన తీరును వివరించారు. ' నేనూ, నా మిత్రుడు బ్రిడ్జి దగ్గర కూర్చున్నాం. ఒక్కసారిగా బ్రిడ్జి విరిగిపోయిన శబ్దం వినిపించింది. వెంటనే అక్కడకు వెళ్లి రక్షించే ప్రయత్నం చేశాం. ఆ సమయంలో ఈత వచ్చిన కొందరు ఈదుకుంటూ బయటకు వస్తున్నారు. ఈత రాని చిన్నారులు, మహిళలు నీట మునిగి మరణించారు. ముందుగా నేను, నా స్నేహితుడు పిల్లలను రక్షించాం. ఆ తర్వాత ఒక పైపు సహాయంతో పెద్ద వాళ్లను కాపాడం. నేను తొమ్మిది మందిని ప్రాణాలతో బయటపడేయగలిగాను. నేను రక్షించే సరికే మరో ఇద్దరు మృతి చెందారు' అని సుభాష్ భాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
బ్రిడ్జి సమీపంలో టీ దుకాణం నడుపుకునే వ్యక్తి చెప్పిన ప్రకారం.. 'ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలింది. దీంతో కొందరు రెయిలింగ్ పట్టుకుని బ్రిడ్జికి వేలాడుతూ ఉన్నారు. అయితే చేతులు నొప్పి పుట్టడంతో ఎక్కువసేపు పట్టుకోలేక నదిలో పడిపోయారు. అందులో ఒక గర్భిణి కూడా ఉంది. వాళ్లను రక్షించి.. ఆస్పత్రికి చేర్చడంలో సహాయం చేశాను. ఓ చిన్న పాపను రక్షించాం.. అయితే ఆస్పత్రికి చేర్చేలోపు ఆ పాప మరణించడం తీవ్ర ఆవేదన కలిగించింది' అని టీ దుకాణం నడుపుకునే వ్యక్తి బాధపడ్డారు.
బ్రిడ్జి సమీపంలో నివసించే హసీనా, ఆమె కొడుకు ఆదివారం రాత్రంతా సహాయక చర్యల్లోనే పాలుపంచుకున్నారు. బాధితులను ఆస్పత్రికి చేర్చడానికి వారి ఇంట్లో ఉన్న రెండు వాహనాలను కూడా స్థానికులకు అందజేసి ఆపద కాలంలో వారి పెద్ద మనసు చాటుకున్నారు.
'నేను కొంతమంది పిల్లలను నా చేతుల మీదుగా ఆస్పత్రికి తీసుకెళ్లా. కానీ అప్పటికే వాళ్లు చనిపోయారని తెలిసింది' అంటూ హసీనా కన్నీరు పెట్టుకున్నారు.
అలాగే విరాల్ భాయ్ దోషి అనే స్థానికుడి కథనం ప్రకారం.. 'ఇంత విషాదం నేనెప్పుడూ చూడలేదు. రాత్రంతా సహాయక చర్యలు చేపట్టడంలో సాయం చేస్తూనే ఉన్నా' అని తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.