Begin typing your search above and press return to search.

హియరింగ్ టైంలో కూల్ డ్రింక్స్ తాగాడు..: శిక్ష ఏంటంటే..?

By:  Tupaki Desk   |   18 Feb 2022 11:30 PM GMT
హియరింగ్ టైంలో కూల్ డ్రింక్స్ తాగాడు..: శిక్ష ఏంటంటే..?
X
సాధారణంగా కోర్టు తీర్పు అంటే ఎలా ఉంటారు..? జడ్జి చెప్పే తీర్పుపై ఉత్కంఠగా ఎదురుచూస్తారు. మిగతా వారు కూడా ఏం జరుగుతోందోఅని ఆలోచిస్తారు. కానీ కొందరు పట్టీ పట్టనట్లు ఉంటారు. అయితే కరోనాసమయం కనుక ప్రస్తుతం వర్చువల్ హియరింగ్సే ఎక్కుగా ఉంటున్నాయి. అయితే కోర్టు హియరింగ్ జరుగుతున్నప్పుడు ఓ వ్యక్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాడు.

అంతేకాకుండా రిలాక్స్ గా కూల్ డ్రింక్ తాగారు. మామాులుగా అయితే ఆ వ్యక్తి కూల్ డ్రింక్ తాగడం పెద్ద విషయం కాదు. కానీ ప్రత్యేక సమయంలో ఇలా చేయడం కోర్టుకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆ వ్యక్తికి జడ్జి వేసిన శిక్షపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కరోనా థర్డ్ వేవ్ కారణంగా కోర్టుకు సెలవులు ఇచ్చారు. వర్చువల్ ద్వారా విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇలా ఓ కేసులో వర్చువల్ హియరింగ్ జరుగుుతున్న సమయంలో ఓ ఇన్ స్పెక్టర్ కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. హియరింగ్ పై దృష్టి పెట్టాల్సింది పోయి రిలాక్స్ అయ్యాడు.

అంటే కూల్ డ్రింక్ తాగుతూ న్యాయమూర్తి కంటపడ్డాడు. దీంతో గుజరాత్ హైకోర్టు చీఫ్ అరవింద్ దృష్టికి ఈ విషయం వచ్చింది. దీంతో విచారణ్ మధ్యలో వదిలేసి లిలా కూల్ గా కూల్ డ్రింగ్ ఎలా తాగావు..? అంటూ ప్రశ్నించారు. అయితే ఇలా చేయడంపై ఆ ఇన్ స్పెక్టర్ న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పారు. కానీ ఆ జడ్జి వినలేదు.

ఈ విచారణ్ వర్చువల్ కాకుండా.. న్యాయస్థానంలో జరిగి ఉంటే మీరు ఇలా డబ్బా తెచ్చుకొని తాగగలరా..? అని అడిగారు. ఓ పోలీసు అధికారి అయి ఉండి ఇలా ప్రవర్తిస్తారా..? అని ఆగ్రహం తెచ్చుకున్నారు. ఇదే సమయంలో మీలాగా ఓ వ్యక్తి ప్రవర్తిస్తే ఏం జరిగిందో తెలుసా..? అంటూ గతంలోని కేసు గురించి తెలిపారు.

ఒకసారి విచారణ సందర్భంగా ఒక న్యాయవాది సమోసా తిన్నాడు. దీనిని న్యాయమూర్తి చూశాడు. వెంటనే అతడిని మందలించాడ. అంతేకాదు. సమోదా ఎవరు తిన్నా మాకేం ఇబ్బంది లేదు. కానీ హియరింగ్ సమయంలో తినడం తప్పు. అని చెప్పాడు. ఎందుకంటే ఇతరులు కూడా దీనిని ఇష్టపడవచ్చు. కానీ మీరు ఒక్కరే సమోసాలు తినడం ఎందుకు..? అని ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వారందరికీ సమోసాలు తెప్పించాలి.. అని ఆదేశించారు.

ఇక తాజా కేసులో పాత కేసును అనుసరించి న్యాయమూర్తి ఆసక్తి తీర్పునిచ్చారు. ఇన్ స్పెక్టర్ క్రమశిక్షణ చర్యలకు పాల్పడినందున సాయంత్రంలోగా కోర్టుకు శీత పానీయాల డబ్బలతో హాజరు కావాలని ఆదేశించారు. 100 క్యాన్ల శీతల పానీయాల డబ్బలు తీసుకురావాలని న్యాయమూర్తి ఇన్ స్పెక్టర్ ను ఆదేశించారు.

దీంతో ఇన్ స్పెక్టర్ చేసిన తప్పుకు న్యాయమూర్తి వేసిన శిక్షపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.