Begin typing your search above and press return to search.
స్తంభానికి కట్టేసి కొట్టిన గుజరాత్ పోలీసులు.. అభినందనలే ఎందుకు?
By: Tupaki Desk | 5 Oct 2022 5:25 AM GMTఒక వైరల్ వీడియో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక వ్యక్తిని స్తంభానికి కట్టేసిన పోలీసు (సివిల్ డ్రెస్ లో ఉన్నారు) ఒకరు లాఠీ పట్టుకొని కొట్టేస్తున్న వీడియో సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ విపరీతంగా షేర్ అవుతోంది.
సాధారణంగా ఒకరిని పోలీసులు ఈ రీతిలో కొడితే.. పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం కావటమే కాదు.. విమర్శలు వెల్లువెత్తుతాయి. అందుకు భిన్నంగా గుజరాత్ పోలీసులు చేసింది మంచి పనే అంటున్న వైనం ఇప్పుడు చోటు చేసుకుంది. ఎందుకిలా? కారణం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. అసలేం జరిగిందో తెలుసుకోవాలి.
గుజరాత్ లోని ఖేడా జిల్లాలో దసరా నవరాత్రుల నేపథ్యంలో మహిళలు.. చిన్నారులు కలిసి గార్బా ఆడుతున్నారు. వీరికి దగ్గర్లో చేరుకున్న కొందరు ఆకతాయిలు వారిపై రాళ్లు రువ్వారు. మహిళలంతా ఒకచోట చేరి గార్బా డ్యాన్స్ చేస్తున్నప్పుడు దాదాపు 150 మంది వరకు అకతాయిలు వారిపై రాళ్లు రువ్విన అంశాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.
రాళ్లు విసిరిన వారిలో ఇప్పటికి 43 మందిపై కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. వీరిలో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు.. గార్బాఆడుతున్న వారి మధ్యకు చేరి సమస్యల్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేయటం.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు వేడుకల్లో రభస చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వారు చేసిన తప్పుడు పనిని తప్పు పడుతూ.. కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
పోలీసులు భారీగా దేహశుద్ధి చేసిన తర్వాత నిందితులు అక్కడున్న వారికి క్షమాపణలు చెప్పినట్లుగా తెలుస్తోంది. వేరే వర్గానికి చెందిన అకతాయిలు చేసిన ఈ తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటి వారికి గుజరాత్ పోలీసులు సరైన రీతిలో బుద్ధి చెప్పినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.