Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ దుస్థితిపై ఆజాద్ సంచలన కామెంట్స్

By:  Tupaki Desk   |   23 Nov 2020 7:00 AM GMT
కాంగ్రెస్ దుస్థితిపై ఆజాద్ సంచలన కామెంట్స్
X
కాంగ్రెస్ లో అసమ్మతి గళాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లు కపిల్ సిబాల్, చిదంబరంలు కాంగ్రెస్ దుస్థితిపై విమర్శలు గుప్పించగా.. తాజాగా కాంగ్రెస్ వ్యవహారాల్లో ఆరితేరిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సైతం సొంత పార్టీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆజాద్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై మాట్లాడారు. కాంగ్రెస్ లో మొదట్లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని.. నాయకుల్లో చాలా మార్పులు వస్తున్నాయని ఆజాద్ అన్నారు. పార్టీ టికెట్ రావడమే ఆలస్యం ఫైవ్ స్టార్ హోటల్స్ లో ప్రత్యక్ష మవుతున్నారని.. ప్రజల్లో కంటే ఏసీ రూముల్లోనే ఎక్కువగా ఉంటున్నారని ఆడిపోసుకున్నారు.

ఇాలాంటి పరిస్థితి పోయే వరకు కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమని ఆజాద్ కుండబద్దలు కొట్టారు. ఈ తీరు వెంటనే మార్చుకోవాలని సూచించారు.. గతంలో కర్ణాటక , ఏపీ, కేరళ రాష్ట్రాల్లో పార్టీ చాలా క్లిస్ట సమయంలో ఉన్నప్పుడు తాను బాధ్యుడిగా ఉంటూ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చానని గుర్తు చేశారు.

ఏపీ రాజకీయాలపై కూడా ఆజాద్ హాట్ కామెంట్స్ చేశారు. 2004, 2009 లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమేనని ఆజాద్ స్పష్టం చేశారు. ఏపీలో కేవలం 7 ఎంపీ స్థానాలు ఉన్న పార్టీకి 35 స్థానాల వరకు రాబట్టడంతోనే అధికారంలోకి వచ్చామని తెలిపారు. ఆ తర్వాత పరిస్థితులు దారుణంగా మారిపోయాయని.. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రావాలంటే నేతలు ఏసీ రూములు వదిలి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.

ప్రస్తుతం ఆజాద్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ ను ఇరుకునపెట్టాయి. వరుసగా కాంగ్రెస్ నేతలు గొంతెత్తుతుండడం చర్చనీయాంశంగా మారింది.