Begin typing your search above and press return to search.
బాబు ఆకర్ష్ రేటు... 30 కోట్లు కాదట 50 కోట్లట
By: Tupaki Desk | 17 Jun 2019 2:40 PM GMT2014 ఎన్నికల్లో అధికారం దక్కించుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విపక్షం వైసీపీని వీలయినంత మేర బలహీనం చేసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సరికొత్త కార్యక్రమం ద్వారా వైసీపీ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో 23 మందిని - ముగ్గురు ఎంపీలను లాగేశారు. ఎమ్మెల్యేలను రాబట్టేందుకు చంద్రబాబు తనదైన శైలి బేరాలు ఆడినట్టుగా గుసగుసలు వినిపించాయి. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు - కొన్ని కాంట్రాక్టులు - మరీ బలమైన నేత అనుకుంటే వీటితో పాటు మంత్రి పదవిని కూడా చంద్రబాబు ఆపర్ చేసినట్టుగా వార్తలు వినిపించాయి. అయితే బాబు ఆడిన బేరం రూ.30 కోట్లు కాదని - అది ఏకంగా రూ.50 కోట్లని ఇప్పుడు తేలింది.
వైసీపీ కంచుకోట కర్నూలు జిల్లా నుంచే చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2014లో ఆలూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ నేత గుమ్మనూరు జయరాంను తన పార్టీలోకి లాగేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేశారట. నాడు తనకు చంద్రబాబు నుంచి వచ్చిన ఆపర్ ఏమిటన్న విషయాన్ని తాజాగా మంత్రిగా మారిన జయరాం బయటపెట్టారు. తనను వైసీపీ నుంచి లాగేసేందుకు చంద్రబాబు ఏకంగా రూ.150 కోట్లతో పాటు మంత్రి పదవిని కూడా ఆపర్ చేశారట. ఇదే ప్రతిపాదనతో చంద్రబాబు ఆయన వద్దకు ఓ మధ్యవర్తిని పంపించారట.
అయితే సంతలో పశువుల మాదిరి అమ్ముడుపోయేందుకు తాను సిద్దంగా లేనని, ఎంతమేర ఆపర్లిచ్చినా తాను వైసీపీని వీడేది లేదని జయరాం తేల్చి చెప్పారట. నాడు చంద్రబాబు బంపర్ ఆపర్లను కాలితో తన్నేసి వైసీపీకి విధేయుడిగా నిలబడ్డ తన నిజాయతీని జగన్ గుర్తించారని, అందుకే ఇప్పుడు మంత్రి పదవి దక్కిందని కూడా జయరాం చెప్పుకొచ్చారు. మొత్తంగా నాడు చంద్రబాబు చేసిన చీకటి వ్యాపారాన్ని జనం కళ్లకు కట్టినట్టుగా వివరించిన జయరాం ప్రకటన ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.