Begin typing your search above and press return to search.
అమెరికాలో పేలిన్ గన్.. 11 మంది మృతి
By: Tupaki Desk | 10 May 2021 3:31 AM GMTఅగ్రరాజ్యం మరోసారి రక్తసిక్తం అయ్యింది. గన్ కల్చర్ తో రక్తంతో తడిచిపోయింది. అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఈ కాల్పుల్లో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలోని కొలరాడోలోని ఓ మొబైల్ హోం పార్కులో పుట్టినరోజు వేడుకల్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఏడుగురు మృతిచెందారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కుటుంబంలోని ఓ మహిళకు నిందితుడు స్నేహితుడు అని పోలీసులు గుర్తించారు.
వేడుకలు జరుగుతున్న సమయంలోనే అక్కడికి ప్రవేశించిన నిందితుడు కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఆ తర్వాత నిందితుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఈ ఘనటతో అక్కడి వారంతా భయాందోళనతో పరుగులు తీశారు.
ఇక వుడ్ ల్యాండ్ లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒ ఓవ్యక్తి ఇరుగుపొరుగు ఉండే వారిపై కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు వారి ఇళ్లలోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ఆ ఇంటికి నిప్పంటించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా వారిపై నిందితుడు కాల్పులు జరిపాడు. ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు ఆ నిందితుడిని హతమార్చారు. అమెరికాలో వరుసగా ఈ కాల్పులు ఘటనలు చోటుచేసుకుంటడడం దిగ్ర్భాంతికి గురిచేస్తోంది.