Begin typing your search above and press return to search.

న‌లుగురిని చంపి..అమెరికాలో టెకీ దారుణం...

By:  Tupaki Desk   |   17 Oct 2019 5:25 PM GMT
న‌లుగురిని చంపి..అమెరికాలో టెకీ దారుణం...
X
భార‌తీయుడైన ఓ టెకీ అమెరికాలో దారుణానికి ఒడిగ‌ట్టాడు. తన కుటుంబంలో ఒక వ్యక్తిని హత్య చేసిన శంక‌ర్ నాగ‌ప్ప అనే టెకీ మరో ముగ్గురిని కూడా హత్య చేశానని.. వారి మృతదేహాలు తన అపార్టుమెంటులో ఉన్నాయని పోలీసులకు చెప్పాడు. అమెరికాలోని రోజ్‌ విల్లే పోలీస్ డిపార్ట్‌ మెంట్ కెప్టెన్ జాషువా సైమన్ తెలిపిన వివరాల ప్రకారం..శంకర్ నాగప్ప హంగడ్ అనే వ్యక్తి తన కారులో ఓ శవాన్ని తీసుకువచ్చి పోలీసులకు లొంగిపోయాడు. అయితే, నాగప్ప చెబుతుంది నిజమా కాదా అని తెలుసుకునేందుకు మొదట అతడి కారును పరిశీలించిన పోలీసులు.. ఆ తర్వాత అతడి అపార్టుమెంటుకు వెళ్లి పరిశీలించగా ఓ వ్యక్తితో పాటు ఇద్దరు మైనర్ల శవాలను గుర్తించి ఒకిత షాక్‌కు లోన‌య్యారు.

నాగ‌ప్ప తన కారులో ఒక మృతదేహాన్ని తీసుకుని హ‌త్య చేసిన ప్రాంతం నుంచి 350 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించి మౌంట్‌ శాస్తలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చి హంగుడ్‌ లొంగిపోయాడ‌ని రోజ్‌ విల్లే పోలీస్‌ విభాగం కెప్టెన్‌ జాషువా సైమన్ చెప్పారు. అనుమానితుడైన శంకర్‌ నాగప్ప హంగుడ్‌కు హతులు నలుగురూ సమీప బంధువులేనని వివరించారు. పోలీసు కస్టడీలో ఉన్న నాగ‌ప్ప‌ ప్రస్తుతం సౌత్‌ ప్లేసర్‌ జైలులో ఉన్నాడని సైమన్‌ చెప్పారు. బెయిల్‌ ను నిరాకరించిన హంగుడ్‌ మీడియాకు ఇంటర్వ్యూలిచ్చేందుకు సైతం నిరాకరించాడని తెలిపారు. కాగా, మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలాఉంగా - పేర్లను వెల్లడించకపోయినప్పటికీ మృతుల్లో ఇద్దరు పెద్దవారు - మరో ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. హతుల వివరాలను వెల్లడించటానికి నిరాకరించిన సైమన్‌ వారి వారసులు వచ్చే వరకూ వాటిని పెండింగ్‌లో ఉంచుతామని చెప్పారు.

నార్త్ కాలిఫోర్నియా రికార్డులను పరిశీలించగా నాగప్ప ఫెడరల్ ట్యాక్స్ కింద 1,78,603 డాలర్లను చెల్లించాల్సి ఉందని స్పష్టమైనట్టు సైమన్ పేర్కొన్నారు. ఈ హత్యలకు ఇదే ప్రధాన కారణం అయి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విచారణ పూర్తయితే వాస్తవాలు బయటపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సుమారు 1.30 లక్షల మంది జనాభా ఉన్న వౌంట్ సష్తా పట్టణంలో ఇలాంటి దారుణం తనకు తెలిసినంతవరకు ఎన్నడూ జరగలేదని ఆయన స్పష్టం చేశారు.ఈ సంఘటన స్థానికులను కదిలించివేసిందని - భయాందోళనలకు గురిచేసిందని పోలీస్ అధికారి సైమన్ వ్యాఖ్యానించారు.