Begin typing your search above and press return to search.
ఏపీ భవన్లో తుపాకీ పేలింది
By: Tupaki Desk | 1 Oct 2015 11:46 AM GMTదేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ లో కాల్పుల సంఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. ఏపీ భవన్ లో కాల్పులు జరిగాయన్న సమాచారం తెలుసుకుని పోలీసులు ఒక్కసారిగా అలర్టయి భవనాన్ని చుట్టుముట్టారు. అయితే, తుపాకీ మిస్ ఫైర్ కారణంగా కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఏపీ భవన్ లోని గోదావరి బ్లాక్ లో 404వ గదిలో ఈ కాల్పులు జరిగాయి.
ఈ ఫైరింగులో ఒకరికి గాయాలయ్యాయి. కాగా 404 గదిలో కొందరు ట్రైనింగు డీఎస్పీలు ఉన్నారని సమాచారం. ఓ ట్రైనీ డీఎస్పీ చేతిలో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో పక్కనే ఉన్న మరో ట్రైనీ డీఎస్పీ తొడభాగానికి గాయమైనట్లు చెబుతున్నారు. అయితే.. వీరి మధ్య వివాదాల కారణంగా కాల్చుకున్నారా... నిజంగానే మిస్ ఫైర్ అయిందా అన్నది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. పోలీసులు ఈ ఘటనపై ఆధారాలు సేకరిస్తున్నారు.
మరోవైపు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఏపీ భవన్లో కాల్పులు జరిగాయన్న సమాచారం విన్నవెంటనే చాలామంది ఆందోళన చెందారు. ఇందులో విద్రోహ చర్య కానీ, లేదంటే ఎవరినైనా టార్గెట్ చేసి జరిగిన వ్యవహారమేమో అన్న ఆందోళన ఏపీలో వ్యక్తమైంది. కానీ, ఈ ఘటనలో పెద్ద నష్టమేమీ జరగకపోవడంతో ప్రాథమిక ఆధారాల బట్టి మిస్ ఫైర్ గానే భావిస్తున్నారు.