Begin typing your search above and press return to search.
గన్ మెన్ తో షూ క్లీన్ చేయించిన డిప్యూటీ సీఎం!
By: Tupaki Desk | 6 Sep 2018 8:47 AM GMTఅత్యున్నత స్థానాల్లో ఉన్న వాళ్లు ఎవరూ ఆకాశంలో నుంచి భూమి మీదకు ఊడి పడలేదు. వారు సైతం అందరిలానే భూమి మీదకు వచ్చిన విషయాన్ని వారు అదేపనిగా మర్చిపోతుంటారు. తాజాగా అలాంటి పనే చేసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్ ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
బెంగళూరు నగరంలోని శివాజీ నగర్ నియోజకవర్గంలో సాగుతున్న అభివృద్ధి పనుల్ని చూసేందుకు అధికారులు.. ఎమ్మెల్యేలతో కలిసి డిప్యూటీ సీఎం వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చూసుకోకుండా తన కాలును బురదలో వేశారు. దీంతో.. షూతో పాటు.. కుర్తాకు సైతం బురద అంటింది. ఉప ముఖ్యమంత్రి వారి షూకు బురద అంటింది.
డిప్యూటీ సీఎం వారి బూటును శుభ్రం చేసేందుకు ఆయన సెక్యూరిటీ సిబ్బందిలో ఒక గన్ మెన్ కింద కూర్చొని షూ క్లీన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. వైరల్ గా మారిన ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ తిట్టి పోస్తున్నారు.
తన చుట్టూ అధికారులు.. ప్రజాప్రతినిధులు ఉన్న వేళలో ఉట్టిపడే రాజసంతో వ్యవహారించిన ఆయన తీరును పలువురు తప్పు పడుతున్నారు. దీనిపై పలువురు పరమేశ్వర్ వివరణ కోరగా.. దీన్నో అంతర్జాతీయ వార్తగా చేయమాకండంటూ మాట దాటేసిన వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రాజకీయంగా అధికారపార్టీకి ఈ వ్యవహారం దెబ్బగా పలువురు అభివర్ణిస్తున్నారు.