Begin typing your search above and press return to search.
అమెరికాలో జడ్జి పై కాల్పులు..ఊహకు అందని ట్విస్ట్
By: Tupaki Desk | 22 Aug 2017 4:53 PM GMTకోర్టుల్లోనూ.. కోర్టు ఆవరణలోనూ న్యాయమూర్తులపై దాడులకు దిగటం కొత్తేం కాదు. రీల్ లైఫ్ లోనూ.. రియల్ లైఫ్ లోనూ ఇలాంటివి ఇప్పటికి చాలానే విని ఉంటాం. చూసి ఉంటాం.కానీ.. తాజాగా అగ్రరాజ్యమైన అమెరికాలో చోటు చేసుకున్న ఘటనను మాత్రం అస్సలు ఊహించలేం సరికదా.. ఇలా జరిగిందా? అని షాక్ తినే పరిస్థితి. ఇంతకీ.. అంతటి షాక్‌కు గురి చేసిన ఈ ఉదంతం అమెరికాలోని ఒహైయోలో చోటు చేసుకుంది.
కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తి జోసెఫ్ పై కాల్పుల ఉదంతం ఆసక్తికరంగా.. సినిమాటిక్ గా సాగింది. న్యాయమూర్తి జోసెఫ్ కోర్టుకు వస్తున్న క్రమంలో అతడిపై ఒక దుండగుడు కాల్పులు జరిపారు. అప్పటివరకూ కారులో వెయిట్ చేసిన ఆగంతకుడు.. న్యాయమూర్తి జోసెఫ్ ఎప్పుడైతే కోర్టు వైపు వెళుతున్నారో వెంటనే.. కారు దిగి ఆయనపై ఐదు రౌండ్లలో కాల్పులు జరిపారు. దీంతో ఒక్కక్షణం షాక్ తిన్నప్పటికీ వెంటనే స్పందించిన సదరు జడ్జి.. తనపై కాల్పులు జరిపిన ఆగంతకుడిపై తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్పులు జరిపారు. అయితే.. జడ్జిపై హత్యాయత్నానికి పాల్పడిన ఆగంతకుడు ఉన్న కారులోని రెండో వ్యక్తి మాతం బయటకు దిగలేదు. ఆగంతకుడిపై జడ్జి జరిపిన కాల్పుల్లో సదరు నిందితుడు ప్రాణాలు కోల్పోయారు.
నిందితుడి కాల్పుల్లో జడ్జికి పలు కీలక కేసుల్లో విచారణ జరుపుతున్నారు. దీంతో ఆయనపై కక్ష పెంచుకున్న ఎవరైనా కాల్పుల దారుణానికి తెగబడి ఉంటారని భావిస్తున్నారు. జడ్జిపై హత్యాయత్నానికి తెగబడితే.. అందుకు భిన్నంగా తనపై దాడికి పాల్పడిన వ్యక్తిని హతమార్చిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.