Begin typing your search above and press return to search.
గుంటూరు జిల్లా కలెక్టర్ కు పాజిటివ్
By: Tupaki Desk | 21 July 2020 5:52 PM GMTసామాన్యులు.. ప్రముఖులు అన్న తేడా లేకుండా ప్రపంచంలో ప్రతి ఒక్కరు తనకు సమానమన్నట్లుగా వ్యవహరించే మాయదారి మహ్మారిగా కరోనాను చెప్పాలి. ఎవరెంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ.. తాను గీసిన గీతను దాటితే చాలు.. చటుక్కున పట్టేసే కరోనా దెబ్బకు ఇప్పటికే పలువురు ప్రముఖులు పాజిటివ్ గా మారి.. విలవిలలాడుతున్నారు.
తాజాగా ఇప్పుడు ఆ జాబితాలోకి గుంటూరు జిల్లా కలెక్టర్ చేరారు. ఏపీ రాజధాని అమరావతికి దగ్గర్లోని గుంటూరు పట్టణంలో ఉండే ఆయనకు.. తాజాగా కరోనా పాజిటివ్ అన్న విషయాన్ని నిర్దారించారు. దీంతో.. జిల్లా యంత్రాంగంలో కలకలం రేగింది. నిత్యం ఉరుకులు పరుగులతో విధులు నిర్వర్తించే కలెక్టర్ కు పాజిటివ్ సోకటంతో జిల్లా అధికారులు ఉలిక్కి పడుతున్నారు.
పరీక్షా ఫలితం పాజిటివ్ వచ్చిన వెంటనే.. కలెక్టర్ ఛాంబర్ ను తాత్కాలికంగా మూసివేశారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ కు పాజిటివ్ అన్న సమాచారం బయటకు వచ్చిన వెంటనే రెవెన్యూ వర్గాల్లో కొత్త ఆందోళన మొదలైంది. గడిచిన పది రోజుల వ్యవధిలో కలెక్టర్ ను కలిసి వారు.. ఆయనకు సన్నిహితంగా ఉన్న వారిలో కొత్త టెన్షన్ మొదలైంది. ఇదిలా ఉంటే.. కలెక్టర్ కుటుంబంలోని మరో ఇద్దరు కూడా కరోనా బారిన పడినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. పలువరరు ప్రభుత్వ అధికారులు.. పోలీసులు... వైద్య సిబ్బందితో పాటు.. పలువురు కరోనా బారిన పడటం గమనార్హం. కలెక్టర్ కు పాజిటివ్ అని తేలటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.