Begin typing your search above and press return to search.

గుంటూరు జేసీ సాహసం.. కరోనా అంత్యక్రియల్లో డేరింగ్

By:  Tupaki Desk   |   3 Aug 2020 2:30 AM GMT
గుంటూరు జేసీ సాహసం.. కరోనా అంత్యక్రియల్లో డేరింగ్
X
కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు అంటేనే అనాథ శవాల్లో తీసివేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కనీసం సొంత కుటుంబ సభ్యులు కూడా కరోనా భయంతో చేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక బంధువులు అటువైపే రావడం లేదు. కనీసం పాడె మోయడానికి నలుగురు లేక కరోనా మృతుల అంత్యక్రియలు కానకష్టంగా మారింది.

ఈ క్రమంలోనే గుంటూరు జేసీ సాహసం చేశారు. అంత్యక్రియల్లో వివక్షను రూపుమాపడానికి స్వయంగా రంగంలోకి దిగారు.కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అపోహలు తొలగించారు.

గుంటూరు జేసీ దినేష్ తాజాగా కరోనా మృతుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాన్ని హైపోక్లోరైడ్ తో రుద్ది, ప్యాక్ చేస్తున్నామని.. మాస్క్ ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ అంత్యక్రియల్లో పాల్గొంటే వైరస్ సోకదని గుంటూరు జేసీ తెలిపారు. పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని తాకినా వైరస్ సోకదని కరోనా మృతుల అంత్యక్రియలు గౌరవంగా జరగాలని జేసీ సూచించారు.