Begin typing your search above and press return to search.
గుంటూరులో కరోనా పంజా:ఎమ్మెల్యే సహా డేంజర్ లో 500మంది
By: Tupaki Desk | 28 March 2020 11:30 AM GMTఏపీలోని గుంటూరు జిల్లాలో కరోనా కలకలం చోటుచేసుకుంది. నిన్నా మొన్నటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని స్థితిలో ఇప్పుడు వందలాది మందికి కరోనా అనుమానితుల సంఖ్య పెరగడం కలవరపెడుతోంది.
గుంటూరు1 ఎమ్మెల్యే ముస్తాఫా బావమరిదికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఎమ్మెల్యే బావమరింది ఢిల్లీలో ఈ నెల 18న ఢిల్లీలో ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరై వచ్చాడు. ఆ తర్వాత ఇటీవలే 500మందికి విందు ఏర్పాటు చేశాడు. వీరంతా కూడా విచ్చలవిడిగా జిల్లా అంతటా తిరిగేశారు. ఎమ్మెల్యే బామ్మర్ధి పార్టీకి హాజరైన వారు చాలా మసీదుల్లో ప్రార్థనలకు కార్యక్రమాలకు హాజరయ్యారు.
ఈ విందులో ఎమ్మెల్యే ముస్తాఫా, అతడి 15మంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దీంతో వీరందరినీ క్వారంటైన్ కు తాజాగా తరలించారు. మిగతా 500మందిని కూడా గుర్తించి క్వారంటైన్ కు తరలించడానికి అధికారులు శ్రమిస్తున్నారు. ఈ రోజు నుంచి గుంటూరు నగరంలో కఠినంగా కర్ఫ్యూ విధిస్తున్న పోలీసులు ప్రకటించారు.
ఎమ్మెల్యే బామ్మర్ధికి కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పుడు అతడు ఇచ్చిన విందులో పాల్గొన్న 500మంది డేంజర్ లో పడ్డారు. ఇప్పటికే ఎమ్మెల్యే - వారి కుటుంబ సభ్యులను అధికారులు క్వారంటైన్ లోకి తరలించారు. మిగతా వారిని గుర్తించే పనిలో పడ్డారు. వీరి ద్వారా ఎంతమందికి కరోనా అంటిందేమోనన్న భయం ఏపీలో గుబులు రేపుతోంది. వీరు ఇలాగే తిరిగితే మాత్రం ఏపీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు కావడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది.