Begin typing your search above and press return to search.
అమెరికాలో యాక్సిడెంట్..
By: Tupaki Desk | 11 Sep 2015 9:37 AM GMTప్రాణాలు తీస్తున్న రోడ్డు ప్రమాదాలకు మరొకరు బలయ్యారు. కాకుంటే.. ఈ రోడ్డు ప్రమాదం అమెరికాలో చోటు చేసుకుంది. ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన మాధవి అనే మహిళ మృతి చెందారు.
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృత్యువాత పడ్డారు. బాపట్లకు చెందిన బాలినేని మాధవి విద్యాభ్యాసంలో భాగంగా అమెరికాకు వెళ్లారు. అనంతరం వివాహం చేసుకొని అమెరికాలోనే స్థిరపడ్డారు. అమెరికాలో ఫార్మాసిస్టుగా ఉద్యోగం చేస్తున్న ఆమె.. బుధవారం ఆపీసుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీ కొనటంతో ఆమె ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న ఆమె.. సీటు బెల్ట్ పెట్టుకోలేదని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణ వార్త విని.. భర్త.. ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా వేదన చెందుతున్నారు. చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని తీస్తుందన్న విషయాన్ని గుర్తిస్తే చాలా విషాదాల నుంచి తప్పించుకునే వీలుంది. కారులో ప్రయాణించే సమయంలో సీటు బెల్ట్ పెట్టుకోవటం తప్పనిసరి అన్న విషయాన్ని మరవకూడదు. తాము నిర్లక్ష్యంతో చేసే తప్పు కుటుంబ సభ్యుల్ని శోకసంద్రంలోకి ముంచెత్తుతుందని మర్చిపోకూడదు.