Begin typing your search above and press return to search.

ఇథియోపియా ప్రమాదంలో గుంటూరు యువతి మృతి

By:  Tupaki Desk   |   11 March 2019 5:34 AM GMT
ఇథియోపియా  ప్రమాదంలో గుంటూరు యువతి మృతి
X
మరో దారుణ విషాదం చోటుచేసుకుంది. ఇథియోపియా దేశానికి చెందిన బోయింగ్737-8 విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని మొత్తం 157మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 149మంది ప్రయాణికులుకాగా.. మిగిలిన 8మంది సిబ్బంది ఉన్నారు.

కాగా ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరుకు చెందిన యువ వైద్యురాలు నూకవరపు మనీషా సహా నలుగురు భారతీయులు మరణించారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరుకు చెందిన నూకవరపు వెంకటేశ్వరరావు-భారతి దంపతుల రెండో కుమార్తె మనీష. గుంటూరు వైద్య కళాశాలలో నాలుగేళ్ల క్రితం ఎంబీబీఎస్ పూర్తి చేసిన మనీషా అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే స్థిరపడింది.

ఇక మనీషా అక్క జింబాబ్వే రాజధాని నైరోబీలో నివాసముంటున్నారు. 10 రోజుల క్రితం లావణ్య ఒకే కాన్పులో ముగ్గురు మగపిల్లలకు జన్మనిచ్చారు. వారిని చూసేందుకు మనీషా అమెరికా నుంచి ఇథియోపియా కు వెళ్లి అక్కడి నుంచి నైరోబీకి ప్రయాణమయ్యారు. ఆ క్రమంలోనే విమాన ప్రమాదంలో మరణించారు.

మనీషా తల్లిదండ్రులు ప్రస్తుతం గుంటూరు నగరంలోని నవ భారత్ నగర్ లో స్థిరపడ్డారు. ఆమె మృతితో స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. మనీషా తల్లిదండ్రులు ప్రస్తుతం నెలరోజులుగా కాన్పుకోసమే పెద్దకుమార్తెతో కలిసి నైరోబీలోనే ఉంటున్నారు.

మనీషాతోపాటు మనదేశానికి చెందిన వైద్య పన్నగేశ్ భాస్కర్, వైద్య హన్సిన్ అన్నగేశ్, శిఖాగార్గ్ విమాన ప్రమాదంలో మరణించారని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది.