Begin typing your search above and press return to search.

ఏపీలో మద్యం అమ్మకాలపై కేంద్రానికి ఫిర్యాదు..బీజేపీ

By:  Tupaki Desk   |   4 May 2020 5:20 PM IST
ఏపీలో మద్యం అమ్మకాలపై కేంద్రానికి ఫిర్యాదు..బీజేపీ
X
ఏపీలో ఒకవైపు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది ..రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. అయితే , రాష్ట్రంలో కరోనా భాదితుల సంఖ్య పెరుగుతున్నా కూడా ప్ర‌భుత్వం మ‌ద్యం అమ్మ‌కాల‌కు అనుమ‌తిచ్చింది. దీంతో ఒక్క‌సారిగా రాష్ట్రంలో ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా మారింది. రాష్ట్రంలో చాలాచోట్ల మ‌ద్యం షాపులు తెరుచుకోవ‌డంతో మందుబాబులు పెద్ద ఎత్తున బారులు తీరారు. రాష్ట్రంలోని వారే కాకుండా పొరుగు రాష్ట్రాల వారు కూడా స‌రిహ‌ద్దులు దాటి మరీ కొంద‌రు మ‌ద్యం కోసం ఏపీకి క్యూ కట్టారు.

దీనితో ఇటు ఏపీ, తెలంగా, అటు ఏపీ ,త‌మిళ‌నాడు బార్డ‌ర్‌ లోని మద్యం దుకాణాల వద్ద అనూహ్య‌మైన ర‌ద్దీ ఏర్ప‌డింది. వారిని పోలీసులు కూడా అదుపుచేయలేకపోతున్నారు. దీంతో ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం స్థానిక బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ప్రభుత్వ చ‌ర్య‌ల‌పై కేంద్రానికి కంప్లైట్ చేస్తామంటున్నారు. రాష్ట్రం ప్రస్తుతం వున్న విపత్కర పరిస్తితుల్లో మద్యం విక్రయాలు అనుమతించటం దారుణమని బీజేపీ గుంటూరు అర్బన్ జిల్లా మాజీ అధ్యక్షుడు అమ్మిశెట్టీ ఆంజనేయులు అన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కేవలం ఆదాయమే ప్రధానంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను అనుమతించటం పై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు అమ్మిశెట్టి ఆంజనేయులు విలేకరుల సమావేశంలో చెప్పారు. గత ఆరు వారాలుగా ప్రజలంతా మద్యం లేకుండా అలవాటు పడిపోయారన్నారు. ఈ స్థితిలో మద్యం అందుబాటులోకి తీసుకువస్తే, అది విపరీత పరిణామాలు కు దారితీసే అవకాశముందన్నారు.