Begin typing your search above and press return to search.
ఏపీలో పాలన బాలేదు.. జనసేనలో చేరతా: మంత్రి బొత్స కీలక అనుచరుడి ప్రకటన
By: Tupaki Desk | 22 Nov 2022 3:48 AM GMTఏపీలో కీలక మంత్రి బొత్స సత్యనారాయణ కీలక అనుచరుడిగా పేరున్న విజయనగరం జిల్లా వైసీపీ నాయకుడు, ప్రముఖ వ్యాపార వేత్త గురాన అయ్యలు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజారాజ్యం, తర్వాత కాంగ్రెస్‌లో ఉన్న ఈయన తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
కొన్నాళ్లుగా బొత్సకు దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆయన తాజాగా ఏపీ ప్రబుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాను త్వరలోనే జనసేన తీర్థం పుచ్చుకుంటున్నట్టు వెల్లడించారు.
జనసేనాని పవన్ కల్యాణ్తో కలసి ప్రయాణించేందుకు నిర్ణయం తీసుకున్నానని గురాన అయ్యలు తెలిపారు. ఈ నెల19న హైదరాబాద్లో పవన్ను మర్యాదపూర్వకంగా కలిశానని వెల్లడించారు.
సుపరిపాలన అందించే ఆయన నాయకత్వాన్ని అందరూ బలపరిచే సమయం ఆసన్నమైందన్నారు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి ఆ పార్టీలో చేరుతానని గురాన అయ్యలు తెలిపారు. తాను స్వతహాగా మెగా ఫ్యామిలీకి అభిమానినని, గతంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేసినట్లు తెలిపారు.
ఏపీలో అన్యాయమైన, స్వార్థపూరిత రాజకీయ పాలనావ్యవస్థను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. జనసేన సిద్ధాంతాలు, పవన్ కల్యాణ్ పోరాటస్ఫూర్తి, అందరికీ సమన్యాయం, మంచి చేయాలనుకునే పవన్ నాయకత్వం నచ్చిందని తెలిపారు.
పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని అందరూ బలపరిచే సమయం ఆసన్నమైందని అన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేసినవారు, వివిధ పార్టీల్లో కష్టపడినా గుర్తింపు లేనివారు జనసేన పార్టీలో చేరి మద్దతు ఇవ్వాలని కోరారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.