Begin typing your search above and press return to search.

ఆమరణ దీక్ష:నిజంగా ప్రాణం పోగొట్టుకున్న నేత

By:  Tupaki Desk   |   4 Nov 2015 4:14 AM GMT
ఆమరణ దీక్ష:నిజంగా ప్రాణం పోగొట్టుకున్న నేత
X
ఇవాళ.. రేపటి రోజున ఏదైనా అంశం మీద ఆందోళనలు నిర్వహించటం.. తమ డిమాండ్ల సాధన కోసం నిరాహారదీక్ష.. ఆమరణ నిరాహార దీక్ష చేయటం.. నాలుగు రోజుల తర్వాత ఒక రాత్రివేళ బలవంతంగా ఆసుపత్రికి తరలించటం.. చికిత్స చేసి ఒకట్రెండు రోజుల్లో బయటకు పంపటం లాంటివి మనం చూస్తునే ఉన్నాం.

దీనికి భిన్నంగా తాజాగా రాజస్థాన్ కు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే చేసిన ఆమరణ నిరాహార దీక్ష కారణంగా తన ప్రాణాల్ని పోగొట్టుకున్న వైనం చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని జనతాదళ్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురుచరణ్ ఛాబ్రా గత కొద్ది రోజులుగా మద్య నిషేధం.. లోకాయుక్తను పటిష్టం చేయాలన్న డిమాండ్ తో గాంధీజయంతి రోజున ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

65 ఏళ్ల సదరు నేత.. తాను చెప్పినట్లుగానే మొండిగా ఆమరణనిరాహార దీక్షలో ఉన్న ఆయన.. నెల రోజులుగా ఆహారం లేకపోవటంతో ఆరోగ్యం క్షీణించింది. రెండు రోజులుగా కోమాలోకి వెళ్లిపోయిన చాబ్రా.. జైపూర్ లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రిలో తాజాగా తుదిశ్వాస విడిచారు. ఒక డిమాండ్ మీద నిరాహారదీక్ష చేస్తూ ప్రాణాలు కోల్పోవటం.. అదీ ఒక రాజకీయ నేత కావటం.. ఈ మధ్య కాలంలో ఇదేనని చెబుతున్నారు.