Begin typing your search above and press return to search.

ఉగ్రదాడిపై ‘తుపాకీ’ విశ్లేషణే నిజమైంది

By:  Tupaki Desk   |   29 July 2015 3:59 AM GMT
ఉగ్రదాడిపై ‘తుపాకీ’ విశ్లేషణే నిజమైంది
X
సోమవారం తెల్లవారుజామున పంజాబ్ లోని పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనకు సంబంధించి ‘తుపాకీ’ సమాచారమే నిజమైంది. భారత్ లోకి ఉగ్రవాదులు ఎప్పుడు ప్రవేశించారన్న అంశంపై ఉగ్రదాడి జరిగిన కొద్ది గంటల అనంతరం ఒక కథనాన్ని ఇచ్చింది.

‘‘ఉగ్రవాదులు ఎన్ని రోజుల ముందు వచ్చి ఉంటారు?’’ అన్న విశ్లేషణ చేసింది. ఈ కథనంలో పేర్కొన్న విధంగానే సోమవారం తెల్లవారుజామున భారత్ లోకి ప్రవేశించి ఉంటారన్న ‘‘తుపాకీ’’ విశ్లేషణ సరిపోయిందన్న విషయం తాజాగా రుజువైంది. ఉగ్రవాదులు ఎప్పుడు ప్రవేశించారన్న అంశంపై పలు ప్రముఖ మీడియా సంస్థలు.. బుధవారం తమ కథనాలు ఇచ్చాయి. అందులోని సారాంశం.. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత.. సోమవారం తెల్లవారుజాము ప్రాంతంలో భారత్ సరిహద్దుల్లోకి చేరి ఉంటారంటూ కథనాలు ఇచ్చారు.

ఇదే విషయాన్ని దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత (సోమవారం సాయంత్రం) తుపాకీ తన కథనంలో పేర్కొంది. ఆదివారం అర్థరాత్రి తర్వాత భారత్ లోకి ఉగ్రవాదులు ప్రవేశించి ఉంటారని మంగళవారం మీడియాతో మాట్లాడిన పంజాబ్ డీజీపీ సుమేథ్ సింగ్ వెల్లడించటం గమనార్హం.

Link : http://www.tupaki.com/politicalnews/article/When-Terrorists-entered-in-India-over-gujarat-Attacks/109590