Begin typing your search above and press return to search.
ఉగ్రవాదులు వెనక్కి తగ్గేలా చేసిన బస్సు డ్రైవర్
By: Tupaki Desk | 28 July 2015 4:28 AM GMTఅత్యాధునిక ఆయుధాలతో విచక్షణ రహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుంటే ఎవరైనా ఏం చేస్తారు? భయంతో వణికిపోతారు? చేష్టలుడిగి షాక్ తిన్నట్లు అవుతారు. కానీ.. ఒక సాదాసీదా పంజాబ్ బస్సు డ్రైవర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. పౌరుషానికి ప్రతీకగా నిలిచే పంజాబీయుల సత్తా ఏమిటో ప్రదర్శించారు. ఆయన చూపించిన తెగువ 74 మంది నిండు ప్రాణాల్ని కాపాడేలా చేసింది. ఒక భారీ ముప్పు నుంచి తప్పించేలా చేసింది.
రక్తదాహంతో తపించి పోయే కరుడుకట్టిన ఉగ్రవాదులు సైతం వెనక్కి అడుగేసేలా చేసిన ఒక డ్రైవర్ సాహసం పెద్ద ఎత్తున ప్రాణాల్ని కాపాడేలా చేసింది. పంజాబ్ రోడ్ వేస్ కు చెందిన ఒక బస్సు డ్రైవర్ అమితమైన దైర్యసాహసాల్ని ప్రదర్శించారు. ఊహించని ప్రమాదం ఎదురైనప్పుడు భయపడి.. బెదిరిపోవటం మామూలే కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరించారు నానక్ చంద్. సోమవారం తెల్లవారు జామున ఉగ్రవాదుల బృందం పంజాబ్ లోకి ప్రవేశించి కలకలం సృష్టించిన వైనం తెలిసిందే.
ఒక రెస్టారెంట్ యజమానిని బెదిరించి అతని కారును అపహరించిన ఉగ్రవాదులు.. ఒక బస్సుపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ సమయంలో బస్సు డ్రైవర్ గా వ్యవహరిస్తున్న నానక్ చంద్ ధైర్యసాహసాల్ని ప్రదర్శించాడు. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నా.. బస్సును మరింత వేగంగా వారి మీదకు దూసుకెళ్లేలా చేశాడు. ఊహించని ఈ పరిణామానికి ఉలిక్కి పడిన వారు.. పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.
బస్సులో 75 మంది ప్రాణాల్ని కాపాడాలన్న ప్రయత్నంతో.. బస్సును వేగగా దూసుకెళ్లేలా చేసిన నానక్ చంద్.. ఉగ్రపంజా నుంచి తప్పించుకొని.. నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయాలు అయితే.. వారికి వైద్య సాయం అవసరమని ఆ పని చేశాడు. ఆసుపత్రికి చేరిన వెంటనే.. పోలీసులకు సమాచారం అందించటం ద్వారా.. బస్సులోని 75 మంది ప్రాణాల్ని కాపాడటమే కాదు.. ఉగ్రవాదులకు ఒక సామాన్య భారతీయుడి సత్తా ఏమిటో రుచి చూపించాడు.