Begin typing your search above and press return to search.
కళ్లు చెదిరేలా చేసిన డేరా బాబా కోట్ల ఆస్తులు
By: Tupaki Desk | 28 Sep 2017 6:42 AM GMTఖచ్చితంగా నెలకిందట దేశాన్ని ఒక్క కుదుపు కుదిపిన డేరా సచ్చా సౌద వ్యవస్థాపకుడు డేరా బాబా అలియాస్ గుర్మీత్ సింగ్ ఉదంతం ఇప్పటికీ సంచలనంగానే మారింది. 2002లో హరియాణాలోని తన ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు సాధ్వీలపై పదే పదే అత్యాచారం చేశారన్న కేసులో ప్రస్తుతం బాబా 20 ఏళ్ల జైలు జీవితం అనుభవిస్తున్నాడు. అయితే, అంతటితో కథ ముగిసి ఉంటే వేరేగా ఉండేది. కానీ బాబా కథలు.. కథలు కథలుగా వెలుగు చూస్తుండడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక్క ఆ ఇద్దరితోనే బాబా అత్యాచార బాగోతం అంతం కాలేదని, ఎందరినో చెరబట్టాడని - పురుషులను నపుంశకులను చేశాడని - కోట్లు కొల్లగొట్టాడని - ప్రత్యామ్నాయ ప్రభుత్వం నడిపాడని అనేక వార్తలు నిజాలై.. జనాల మతి పోగొట్టాయి.
ఇక, ఆయన చేరదీసిన దత్తత కుమార్తె హనీ ప్రీత్.. ఇప్పటికీ ప్రభుత్వానికి సవాలుగానే మారింది. ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఇక, ఆమె దత్తత కూతురు అంటున్నా.. బాబా ఆమెను అనేక సార్లు ``అన్ని విధాలుగా`` వాడుకున్నాడని కథనాలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత తాజాగా హనీ భర్తనంటూ.. మీడియా ముందుకు వచ్చిన వ్యక్తి.. హనీకి - బాబాకి మధ్య ఉన్న సంబంధం వెల్లడించాడు. ఇలా రోజుకో విధంగా డేరా తొలుగుతూ.. డేరా బాబా బాగోతాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇక, ఇప్పుడు తాజాగా బాబా ఆస్తిపై సరికొత్త వార్తలు - ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన ఆస్తుల చిట్టా.. మరింతగా మతి పోగొడుతోంది.
బాబా అక్రమంగా కోట్లలో ఆస్తులు కూడబెట్టినట్లు హరియాణా ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. డేరా బాబా ఆస్తులకు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో బుధవారం హరియాణా - పంజాబ్ హైకోర్టుకు సమర్పించింది. ఆయనకు సిర్సా ప్రాంతంలోనే దాదాపు రూ.1,453 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రభుత్వం నిర్ధారించింది. హరియాణా వ్యాప్తంగా డేరా సంస్థలకు చెందిన ఆస్తులు రూ.1,600 కోట్లకు పైచిలుకే ఉండొచ్చని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తంగా వీటి విలువ రూ.3 వేల కోట్లకు పైగా చేరి.. ప్రభుత్వ అంచనాలను మించి పోయాయి. వాటి విలువ అనుకున్న దాని కంటే 1.5 రెట్లు అధికంగా ఉన్నాయి.
సిర్సాలో రూ.1453కోట్లు - అంబాలాలో రూ.32.20కోట్లు - ఝాజ్జర్ రూ.29.11కోట్లు - ఫతేబాద్ రూ.20.70కోట్లు ఉన్నట్లు ప్రభుత్వం న్యాయస్థానానికి తెలియజేసింది. గుర్మీత్ కు 504 బ్యాంకు ఖాతాల్లో.. రూ.75కోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 504 బ్యాంకు ఖాతాల్లో ఒక్క సిర్సా జిల్లాలోనే 495 ఉన్నాయి. దీంతో డేరా ఆస్తులు చూసి అధికారులే కళ్లు తేలేశారట. ఇక, ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగుతోంది. దీంతో బాబా ఇక విదేశాల్లో దాచిన లేదా లావాదేవీలు నిర్వహించిన ఆస్తులు కూడా బయటపడే అవకాశం కనిపిస్తోంది. మరి ఇవెంత హిస్టరీ సృష్టిస్తాయో చూడాలి.