Begin typing your search above and press return to search.
డేరా బాబా నపుంసకుడా...షాక్ తిన్న కోర్టు
By: Tupaki Desk | 31 Aug 2017 8:19 AM GMTవివాదాస్పద డేరా బాబాకు న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రేప్ కేసులో నుంచి ఎలాగైనా బయటపడాలని చూసిన డేరా బాబా తనను తాను నపుంసకుడిగా కూడా చెప్పుకున్నాడట. తాజాగా ఈ విషయం వెల్లడైంది. కోర్టు వాదలను సంబంధించి ఒక్కో ఆసక్తికర విషయం బయటకు వస్తోంది. 1990 నుంచి తనకు లైంగిక సామర్థ్యం లేదని - తాను శృంగారానికి పనికి రానని సీబీఐ కోర్టు జడ్జి జగ్ దీప్ సింగ్ ముందు గుర్మీత్ తన వాదన వినిపించాడు. అలాంటి తాను ఈ రెండు రేప్ లు ఎలా చేస్తానని తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశాడు.
రెండు రేప్ కేసుల్లో గుర్మీత్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ సందర్భంగా గుర్మిత్ ఆసక్తికరమైన వాదన చేశారు. 1999లో గుర్మీత్ ఈ రేప్ లు చేసినట్లు ఆరోపణలు ఉండటంతో.. అతను 1990 నుంచే తనకు లైంగిక సామర్థ్యం లేదని చెప్పి తప్పించుకోవాలని చూశాడు. ఇదొక్క కారణం చాలు అతనిపై ఉన్న రేప్ కేసులు కొట్టేయడానికి అని గుర్మీత్ తరఫు లాయర్లు వాదించారు. పైగా ప్రాసిక్యూషన్ కూడా ఈ విషయంలో అతనికెప్పుడూ పరీక్షలు జరపలేదని వాళ్లు చెప్పారు. అయితే ఇక్కడే న్యాయమూర్తి జగ్ దీప్ సింగ్ వేసిన ప్రశ్నకు గుర్మీత్ తెల్లమొహమేశాడు.
ఈ కేసులో గుర్మీత్ కు అనుకూలంగా సాక్ష్యం చెప్పిన వారిలో ఒక వ్యక్తి.. అతనికి ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు కూడా చెప్పాడు. ఇదే విషయాన్ని న్యాయమూర్తి లేవనెత్తారు. హాస్టల్ వార్డెన్లలో ఒకరు గుర్మీత్ కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, వాళ్లు కూడా డేరా హాస్టల్ లోనే ఉంటున్నారని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. దీంతో అతను చెప్పింది అబద్ధమని న్యాయమూర్తి తేల్చేశారు.తనను నమ్మిన భక్తులతోనే ఓ క్రూర మృగంలా వ్యవహరించిన గుర్మీత్ పై ఏమాత్రం సానుభూతి చూపించేది లేదని కూడా జగ్ దీప్ సింగ్ వ్యాఖ్యానించారు.