Begin typing your search above and press return to search.

జైల్లో డేరా బాబా..ఇదో హాట్ అప్‌డేట్‌

By:  Tupaki Desk   |   23 Jun 2018 1:36 PM GMT
జైల్లో డేరా బాబా..ఇదో హాట్ అప్‌డేట్‌
X
బాబా ముసుగులో తన డేరాలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డ డేరా సచ్చ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ గురించి ఆస‌క్తిక‌ర‌ వార్త ఒక‌టి తెర‌మీద‌కు వ‌చ్చింది. రేప్ కేసులో డేరా బాబాపై తీర్పు చెప్పిన ప్ర‌త్యేక సీబీఐ కోర్టు జ‌డ్జి జ‌గ‌దీప్ సింగ్ త‌న తీర్పులో క్రూర మృగంగా ముద్ర వేస్తూ ఘాటైన‌ వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న భ‌క్తురాళ్ల ప‌ట్ల ర‌హీమ్ అడ‌వి మృగంలా వ్య‌వ‌హ‌రించాడ‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. `స్వంత భ‌క్తురాళ్ల‌ను అత‌ను వ‌ద‌ల‌లేదు - అత‌నో క్రూర మృగంగా ప్ర‌వ‌ర్తించాడు - అలాంటి వ్య‌క్తుల‌కు క్ష‌మాభిక్ష ఉండ‌ద‌ని జ‌డ్జి త‌న తీర్పులో స్ప‌ష్టం చేశారు. ఆధ్మాత్మిక గురువుగా పేరుగాంచిన గుర్మీత్ అత్యంత పవిత్ర‌మైన భార‌త భూమికి తీర‌ని న‌ష్టాన్ని మిగిల్చాడు. రామ్ ర‌హీమ్ త‌న భ‌క్తుల ప‌ట్ల ఎటువంటి మాన‌వ‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించ‌లేదు` అని న్యాయమూర్తి అన్నారు. శిక్ష విష‌యంలో కోర్టు నుంచి ఎటువంటి ద‌యాద‌క్షిణ్యాల‌ను ఆశించ‌వ‌ద్దు అని జ‌డ్జి త‌న తీర్పులో వెల్ల‌డించారు. రెండు రేప్ కేసులకు క‌లిపి గుర్మీత్‌ కు 20 ఏళ్ల జైలు శిక్ష ఖ‌రారు అయ్యింది.

ఇలా 20 ఏళ్ల‌ జైలు శిక్ష పడిన గుర్మిత్ ప్రస్తుతం ఆయన హర్యానాలోని రోహ్‌ తక్ జైల్‌ లో శిక్షను అనుభవిస్తున్నాడు. ఈ విలాస బాబా జీవితం ఎలా ఉంద‌నేది అనూహ్య ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తాజాగా వెలుగులోకి వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం జైలులో మనోడికి నో వీఐపీ ట్రీట్‌ మెంట్. సాధారణ ఖైదీలాగానే మనోడిని కూడా జైలు అధికారులు ట్రీట్ చేస్తున్నారు. అధికారులు ఆయనకు 100 యార్డుల స్థలాన్ని కేటాయించారు . దాంట్లో గుర్మీత్.. తన సొంత చేతులతో కూరగాయలు పండిస్తున్నాడు. ఇప్పటి వరకు ఒకటిన్నర క్వింటాళ్ల ఆలుగడ్డలు - అలొవెరా - టమాటాలు - సోరకాయ - బీరకాయ లాంటి కూరగాయలను పండించాడట. ఇలా కూరగాయలు పండిస్తూ రోజుకు అక్షరాలా 20 రూపాయలు సంపాదిస్తున్నాడు. గుర్మీత్ పండించిన కూరగాయలను జైలులో ఉన్న ఖైదీల వంట కోసమే ఉపయోగిస్తున్నారట.