Begin typing your search above and press return to search.

డేరాలో గుర్మీత్ మార్క్ బిగ్ బాస్‌!

By:  Tupaki Desk   |   23 Sep 2017 4:22 AM GMT
డేరాలో గుర్మీత్ మార్క్ బిగ్ బాస్‌!
X
రాజు త‌లుచుకుంటే దెబ్బ‌ల‌కు కొద‌వ ఉండ‌దు. త‌న‌ను తాను దేవుడిగా చెప్పుకునే డేరా బాబా వేసిన వేషాల గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. విశాల‌మైన త‌న ఆశ్ర‌మంలో ప్రైవేటు సామ్రాజ్యాన్ని న‌డిపిన డేరా బాబా అలియాస్ గుర్మీత్‌కు సంబంధించిన విస్మ‌య‌క‌ర విష‌యాల్ని హ‌నీప్రీత్ మాజీ భ‌ర్త విశ్వాస్ గుప్తా వెల్ల‌డించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. గుర్మీత్ పై ప‌లు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఇద్ద‌రు సాధ్వీల‌ను అత్యాచారం చేసిన కేసులో జైలుశిక్ష అనుభ‌విస్తున్న గుర్మీత్ గురించి చెబుతూ.. డేరా ఆశ్ర‌మంలోని అక్ర‌మాల‌కు అంతు లేద‌న్నారు. బుల్లితెర మీద సంచ‌ల‌నం సృష్టిస్తున్న బిగ్ బాస్ షో త‌ర‌హాలోనే గుర్మీత్ మార్క్ బిగ్ బాస్ షోను ఆశ్ర‌మంలో నిర్వ‌హించేవార‌న్నారు. 28 రోజుల పాటు 6 జంట‌లు డేరాబాబా బిగ్ షోలో పాల్గొనేవ‌న్నారు.

త‌న మాజీ భార్య హ‌నీప్రీత్ ను ద‌త్త‌పుత్రిక‌గా చెప్పుకోవ‌టం అబ‌ద్ధ‌మ‌న్నారు. సెలబ్రిటీలు పాల్గొనే ప్రముఖ టెలివిజన్‌ కార్యక్రమం బిగ్‌ బాస్‌ తరహా షోను డేరా సచ్చా సౌదాలో చీఫ్‌ గుర్మీత్‌ సింగ్‌ నిర్వహించేవారట. గుర్మీత్‌ దత్తత తీసుకున్నట్లుగా చెప్తున్న హనీప్రీత్‌ మాజీ భర్త విశ్వాస్‌ గుప్తా ఈ విషయాన్ని శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. అత్యాచార కేసుల్లో దోషిగా తేలిన గుర్మీత్‌ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తుండటం తెలిసిందే.

‘డేరాలో బిగ్‌ బాస్‌ తరహా కార్యక్రమాన్ని గుర్మీత్‌ 6 జంటలతో నిర్వహించేవారు. 28 రోజులపాటు 6 జంటలు అక్కడ నివసించేవి’ అని ఆయన తెలిపారు. గుర్మీత్‌కు హనీప్రీత్‌ దత్తపుత్రిక అని చెప్పడం కేవలం ఒక ముసుగు అనీ, వారిద్దరూ భార్యాభర్తల్లానే ఉండేవారని విశ్వాస్‌ స్పష్టం చేశారు. చట్టబద్ధంగా పెళ్లి చేసుకోకపోయినా 2009 నుంచి హనీప్రీత్‌ గుర్మీత్‌ కు భార్యగా అతని వద్దే ఉంటోందన్నారు.

గుర్మీత్ ఆదేశాల‌తోనే తాను 1999లో హ‌నీప్రీత్‌ ను పెళ్లి చేసుకున్నాన‌ని.. వారిద్ద‌రికి లైంగిక సంబంధం ఉంద‌న్నారు. ఆ విష‌యాన్ని తాను ప్ర‌త్య‌క్షంగా చూసిన‌ట్లుగా పేర్కొన్నారు. ఎవ‌రికైనా చెబితే త‌న‌ను చంపేస్తాన‌ని చెప్పార‌ని.. హ‌నీ ఎప్పుడూ గుర్మీత్‌ తోనే ఉండేద‌న్నారు. డేరాలోని గుర్మీత్ నివాసం గుఫాలోనే వారిద్ద‌రూ గ‌డిపేవార‌ని.. ఇద్ద‌రూ క‌లిసి త‌న‌ను త‌న కుటుంబాన్ని చాలాసార్లు బెదిరించార‌న్నారు.

త‌మ‌పై కేసులు పెట్టార‌ని.. త‌న‌ను చంపేయాల‌ని త‌న అనుచ‌రుల‌కు గుర్మీత్ ఆదేశించార‌న్నారు. జైల్లో ఉన్న‌ప్ప‌టికీ గుర్మీత్ చాలా బ‌ల‌వంతుడ‌ని.. మీడియాతో మాట్లాడిన త‌ర్వాత తాను బ‌తికి ఉంటానో లేదోన‌న్న భ‌యాన్ని ఆయ‌న వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. క‌న్నీళ్లు పెట్టుకుంటూ బ‌య‌ట‌కు వెళ్లిపోయారు.