Begin typing your search above and press return to search.

ఆ త్రీ సిటీస్‌.. ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌!

By:  Tupaki Desk   |   15 Jan 2018 5:34 AM GMT
ఆ త్రీ సిటీస్‌.. ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌!
X
దేశంలో ఫిట్ గా ఉండే న‌గ‌ర ప్ర‌జ‌లు ఎవ‌రు? అదే స‌మ‌యంలో దేశంలో అత్యంత బ‌ద్ధ‌కంగా ఉండే న‌గ‌ర ప్ర‌జ‌లు ఎవ‌రు? అన్న ప్ర‌శ్న‌ల‌కు తాజాగా స‌మాధానం వ‌చ్చేసింది. మొబైల్ హెల్త్ అండ్ ఫిట్ నెస్ ఫ్లాట్ ఫామ్ హెల్తీఫైమ్ సంస్థ ఒక స‌ర్వేను నిర్వ‌హించింది. ఇందులో దేశంలో ఫిట్ నెస్‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇచ్చే టాప్ త్రీ సిటీస్ ఏవి? బ‌ద్ధ‌కంతో ఊగిపోయే టాప్ త్రీ సిటీస్ ఏమిట‌న్న లెక్క‌ను తేల్చారు.

వీరి స‌ర్వే ప్ర‌కారం గురుగ్రామ్‌.. నోయిడా.. ఘ‌జియాబాద్ న‌గ‌రాల్లో నివ‌సించే వారు ఫిట్ నెస్ మీద ఎక్కువ‌గా దృష్టి సారిస్తార‌ని తేల్చారు. వీరు నిత్యం స‌గ‌టున 340 క్యాల‌రీలు క‌రిగించుకునేందుకు క‌ష్ట‌ప‌డ‌తార‌ని తేల్చారు. నెల‌లో క‌నీసం ప‌ది రోజుల పాటు వ‌ర్క్ అవుట్స్ చేస్తార‌ని పేర్కొన్నారు.

ఈ మూడు న‌గ‌రాలు ఫిట్ నెస్ కు అంత ప్రాధాన్యం ఇస్తే.. దీనికి భిన్నంగా ఏ మాత్రం ఫిట్ గా ఉండ‌కుండా బ‌ద్ధంగా ఉండే బ్యాచ్ లో కోల్ క‌తా.. ల‌క్నో.. అహ్మ‌దాబాద్ వాసులు ఉంటార‌ని తేల్చారు. ఈ న‌గ‌రాల ప్ర‌జ‌లు ఫిట్ నెస్ కు.. ఆరోగ్యానికి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వ‌ర‌ట‌. ఈ మూడు న‌గ‌రాల ప‌ర‌జ‌లు నెల‌లో స‌గ‌టున నాలుగు రోజుల కంటే త‌క్కువ‌గా వ‌ర్క్ అవుట్స్ చేస్తార‌ని స‌ద‌రు నివేదిక తేల్చింది.

గుర్ గ్రామ్‌.. నోయిడా.. ఘ‌జియాబాద్ లో దాదాపు 45 శాతం ప్ర‌జ‌లు ప్ర‌తి రోజు ర‌న్నింగ్ చేస్తార‌ని చెప్పింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే చురుకు విష‌యంలో భార‌తీయ మ‌హిళల కంటే పురుషులే చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని తేల్చింది. పురుషులు నెల‌లో 14 రోజులు వ‌ర్క్ అవుట్స్ చేయ‌గా.. ఆడాళ్లు మాత్రం కేవ‌లం 11 రోజులే వ‌ర్క్ అవుట్స్ తో స‌రిపెడ‌తార‌ని చెప్పింది.

పురుషులు చేసే వ‌ర్క్ అవుట్స్ లో పుష‌ప్స్‌.. సైక్లింగ్ లాంటి వాటిపై ఎక్కువ ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తే.. మ‌హిళ‌లు మాత్రం యోగానే ఎక్కువ‌గా న‌మ్ముకున్న‌ట్లు తేల్చింది. యోగాలోనూ సూర్య న‌మ‌స్కారాల‌కు మ‌హిళ‌లు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లుగా వెల్ల‌డించారు. ఇక‌.. దేశంలో చురుకుద‌నం విష‌యానికి వ‌స్తే.. ఢిల్లీ.. ముంబ‌యి.. బెంగ‌ళూరు.. చెన్నై వాసులు చురుగ్గా ఉన్న‌ట్లుగా తేల్చింది. మెట్రో వాసులు ర‌న్నింగ్‌.. స్విమ్మింగ్‌.. పుష‌ప్స్ మీద ఎక్కువ‌గా దృష్టి పెడుతుంటే.. నాన్ మెట్రోవాసులు మాత్రం న‌డ‌క మీద‌నే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్న‌ట్లు తేల్చారు. అంతా బాగుంది కానీ.. ఎక్క‌డా హైద‌రాబాద్ మాట ప్ర‌స్తావించ‌క‌పోవ‌టం ఏమిటి..?