Begin typing your search above and press return to search.

తెరాస‌లో చేరిక‌లు ఆ పార్టీకే న‌ష్ట‌మా..!

By:  Tupaki Desk   |   29 Aug 2015 8:47 AM GMT
తెరాస‌లో చేరిక‌లు ఆ పార్టీకే న‌ష్ట‌మా..!
X
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌ రెడ్డి ఇలాకా కొడంగ‌ల్‌ లో విచిత్ర రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌లువురు టీడీపీ నాయ‌కులు, టీడీపీ ప్ర‌జా ప్ర‌తినిధులు అధికార పార్టీ తెరాస‌లో చేరారు. ఎక్క‌డైనా ఒక పార్టీకి చెందిన నేత‌లు మరో పార్టీలో చేరితో ఆ పార్టీ బ‌ల‌ప‌డుతుంది. కానీ ఇక్క‌డ మాత్రం టీడీపీ నాయ‌కులు తెరాస‌లో చేరుతుంటే అక్క‌డ తెరాస‌నే న‌ష్ట‌పోనుంద‌న్న గుస‌గుస‌లు నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్లో వినిపిస్తున్నాయి.

కొడంగల్ మండల పరిషత్ అధ్యక్షుడు దయాకరరెడ్డి త‌న అనుచ‌ర‌గ‌ణంతో టీడీపీకి టాటా చెప్పి తెరాస‌లో చేరారు. ద‌యాక‌ర్‌ రెడ్డి తెరాస‌లో చేర‌డం తెరాస‌కే ఎక్కువ న‌ష్టం చేస్తోంద‌ట‌. ద‌యాక‌ర్‌ రెడ్డికి కొడంగ‌ల్‌ లో కాస్త బ‌ల‌మైన నేత‌గా పేరుంది. ఆయ‌నకు కొడంగ‌ల్ తెరాస ఇన్‌ చార్జ్ గురునాధ‌రెడ్డికి పొస‌గ‌దు. దీంతో దయాకర్‌రెడ్డి జిల్లాకే చెందిన మంత్రి ల‌క్ష్మారెడ్డిని తీసుకువ‌చ్చి ఆయ‌న ఆధ్వ‌ర్యంలో గులాబి కండువాలు క‌ప్పుకున్నారు.

నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ చార్జ్‌ గా ఉన్న త‌న‌ను సంప్ర‌దించ‌కుండా టీడీపీ నేత‌ల‌ను పార్టీలో ఎలా చేర్చుకుంటున్నార‌ని ల‌క్ష్మారెడ్డిపై గురునాధ‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తుతున్నారు. ఈ స‌మావేశానికి కూడా ఆయ‌న వెళ్ల‌లేదు...త‌న‌కు ఆహ్వానం లేని కార్య‌క్ర‌మానికి తాను వెళ్లేది లేద‌ని గురునాధ‌రెడ్డి చెపుతున్నారు. ఇదిలా ఉంటే దామెద‌ర్‌ రెడ్డి చేరిక‌తో కొడంగ‌ల్‌ లో తెరాస‌కు లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌ని..ఆయ‌న చేరిక తెరాస‌లో వ‌ర్గ రాజ‌కీయాలకు వేదికవుతుంద‌ని..ఇది టీడీపీకే ఎక్కువ‌గా లాభిస్తుంద‌ని టీడీపీ నేత‌లు సంతోష‌ప‌డుతున్నారు.ఇప్ప‌టికే మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ జిల్లాలో జూప‌ల్లి, ల‌క్ష్మారెడ్డి, ఎంపీ జితేంద‌ర్ గ్రూపులు ఉన్నాయి. ఈ కోవ‌లోనే పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న కొడంగ‌ల్‌ లో మ‌రో కొత్త గ్రూప్ త‌యారైంది.