Begin typing your search above and press return to search.

`గుత్తా` వారి గ‌డ‌బిడ రాజ‌కీయం.. వ్యూహ‌మేంటి?

By:  Tupaki Desk   |   6 Oct 2021 7:27 AM GMT
`గుత్తా` వారి గ‌డ‌బిడ రాజ‌కీయం.. వ్యూహ‌మేంటి?
X
గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి. తెలంగాణ రాజ‌కీయాల్లో.. తన‌దైన శైలిలో దూకుడు చూపించి.. సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు. ప్ర‌స్తుతం అధికార పార్టీ.. టీఆర్ ఎస్‌లో చ‌క్రం తిప్పుతున్నారు. అయితే.. ఇటీవ‌ల కొన్నాళ్లుగా.. ఆయ‌న రాజ‌కీయంగా సెంట‌ర్ అయ్యారు. అధికార పార్టీపైనా.. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పైనా.. తీవ్ర అసంతృ ప్తి వ్య‌క్తం చేస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి దీనికి కార‌ణ‌మేంటి? గుత్తా ఎందుకు .. గ‌డ‌బిడ‌కు గుర‌వుతున్నారు? నిన్న మొన్న‌టి వ‌ర‌కు క్టీన్ ఇమేజ్ ఉన్న నాయ‌కుడికి ఇప్పుడు ఎందుకు క‌ష్టాలు వ‌చ్చాయి? అనేది రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది.

తొలుత‌.. టీడీపీతో రాజ‌కీయాలు ప్రారంభించిన‌.. గుత్తా సుఖేంద‌ర్‌.. 1999లో తొలిసారి ఎంపీ అయ్యారు. న‌ల్ల‌గొండ‌.. పార్ల‌మెంటు స్థానం నుంచి విజ‌యం సాధించిన ఆయ‌న.. త‌ర్వాత కాలంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. 2009 నాటికి అప్ప‌టి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. పిలుపుతో.. టీడీపీని వ‌దిలేసి.. ఆయ‌న కాంగ్రెస్ కండువా క‌ప్పుకొన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న న‌ల్ల‌గొండ పార్ల‌మెంటు స్థానం నుంచి 2009, 2014లో కూడా కాంగ్రెస్ టికెట్‌పై విజ‌యం సాధించారు. అయితే.. గుత్తాకు ఉన్న కోరిక మాత్రం నెర‌వేర‌లేదు. మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకుని చ‌క్రం తిప్పాల‌ని అనుకున్నారు.

ఈ నేప‌థ్యంలో 2014లో ఎంపీగా ఉంటూనే.. ఆయ‌న టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న‌కు టీఆర్ ఎస్ అధినేత‌.. కేసీఆర్ టికెట్ ఇవ్వ‌కుండా.. ఎమ్మెల్సీని చేశారు. అదేస‌మ‌యంలో తెలంగాణ రాష్ట్ర రైతు స‌మాఖ్య స‌మన్వ‌య సమితి కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేసి.. దానికి గుత్తాను చైర్మ‌న్‌గా నియ‌మించారు. కేవ‌లం గుత్తా కోస‌మే.. ఈ ప‌ద‌విని సృష్టించార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. కేసీఆర్ వెన‌క్కి త‌గ్గ‌లేదు.క‌ట్ చేస్తే.. ఈ ఏడాది జూన్ నాటికి ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వి కాలం పూర్తి అయింది. దీంతో ఆయ‌న ఆప‌దవిని వ‌దులుకున్నారు. అయితే.. ఇప్పుడు మాత్రం ఆయన‌ అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు.

దీనికి కార‌ణం.. ఇన్ని పార్టీలు మారినా.. త‌న కోరిక నెర‌వేర‌క పోవ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మంత్రి ప‌దవి ద‌క్కించుకునేందుకు గుత్తా.. అనేక ప్ర‌య‌త్నాలు చేశారు. అయిన‌ప్ప‌టికీ.. గుత్తాను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. దీనికి కూడా కార‌ణం ఉంది.. రాజ‌కీయ జిల్లాగా పేరున్న న‌ల్ల‌గొండలో.. అన్ని పార్టీల‌కూ.. బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే మ‌త్రి వ‌ర్గం విష‌యంలో గుత్తా కోరిక నెర‌వేర‌లేదు. ఇక‌, ఇప్ప‌డైనా.. త‌న ప్ర‌యత్నాన్ని ముమ్మరం చేయాల‌ని భావించిన‌..గుత్తా.. అధికార పార్టీపై చిందుతు తొక్క‌తున్నారు. వాస్త‌వానికి త‌న ఎమ్మెల్సీ కాలం ఈ ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో తిరిగి దీనిని రెన్యువ‌ల్ చేయించుకుని.. మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు ఆయ‌న ముమ్మ‌ర ప్ర‌త‌య్నాలు చేస్తున్నార‌ని అంటున్నారు .. ఆయ‌న అనుచ‌రులు. మ‌రి గుత్తా వ్యూహం ఫ‌లిస్తుందా.? లేదాచూడాలి.