Begin typing your search above and press return to search.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలపై గుత్తా కీలక వ్యాఖ్యలు
By: Tupaki Desk | 27 Dec 2020 10:30 AM GMTదుబ్బాక ఉప ఎన్నిక తర్వాత ఇప్పుడు తెలంగాణలో అందరి చూపు ‘నాగార్జున సాగర్’పైనే పడింది. నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ ఉప ఎన్నిక చుట్టూ ఇప్పుడు జోరుగా రాజకీయం నడుస్తోంది.
దుబ్బాకలో గెలిచిన బీజేపీ.. ఇక్కడ బలంగా ఉన్న కాంగ్రెస్ తోపాటు అధికార టీఆర్ఎస్ కూడా ఈ ఉప ఎన్నికపై దృష్టి పెట్టాయి. సీరియస్ గా తీసుకొని ఇప్పటి నుంచే ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. అభ్యర్థుల కోసం వేట మొదలుపెట్టాయి.
తాజాగా టీఆర్ఎస్ నుంచి ముఖ్యంగా ముగ్గురు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి.అందులో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వీరితోపాటు కోటిరెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఇక నోముల మరణించడంతో ఆయన కుటుంబానికే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా హాట్ కామెంట్స్ చేశారు.నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవం చేసే ఆలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సాగర్ లో తాను పోటీచేయనని స్పష్టం చేశారు. పోయిన సారి ఎమ్మెల్యేగా పోటీచేసి మంత్రిని అవుదామని గుత్తా కలలుగన్నారు. ఈసారి అవకాశం వచ్చిన వద్దంటున్నారు. గుత్తా వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.