Begin typing your search above and press return to search.

డీఎస్‌ పై హైకోర్టులో కేసు

By:  Tupaki Desk   |   27 Aug 2015 9:21 AM GMT
డీఎస్‌ పై హైకోర్టులో కేసు
X
పీసీసీ మాజీ అధ్య‌క్షుడు, ప్ర‌స్తుత టీఆర్ ఎస్ నాయకుడు డి.శ్రీనివాస్‌ ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమించడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా ఈ పదవి ఇచ్చారని ఆయన పిటిషన్‌ లో పేర్కొన్నారు. డీఎస్‌ కు కేబినెట్‌ హోదా ఎలా ఇస్తారని గుత్తా సుఖేందర్‌ రెడ్డి ప్రశ్నించారు. ఈ పిటిషన్ శుక్ర‌వారం విచారణకు రానుంది.

గ‌తంలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌కు పార్ల‌మెంట‌రీ సెక్ర‌ట‌రీ ప‌ద‌వుల‌ను సీఎం కేసీఆర్ క‌ట్ట‌బెట్టిన విధానం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని పేర్కొంటూ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి హైకోర్టును ఆశ్ర‌యించారు. గుత్తా అభ్య‌ర్థ‌న మేర‌కు పిటిష‌న్‌ ను విచారించిన కోర్టు..అన్ని వివ‌రాల‌ను ప‌రిశీలించి పార్ల‌మెంట‌రీ సెక్ర‌ట‌రీల‌ను తొల‌గించాల‌ని ప్ర‌భుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. మ‌రోమారు గుత్తా డీఎస్‌ పై పిటిష‌న్ వేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.