Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డి అడ్డంగా బుక్క‌యిపోయాడా?

By:  Tupaki Desk   |   25 Dec 2016 10:02 AM GMT
కోమ‌టిరెడ్డి అడ్డంగా బుక్క‌యిపోయాడా?
X
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ - ఆ పార్టీ నేత‌ల్లో డైన‌మిజం ప్ర‌ద‌ర్శించే వారిలో ఒక‌రైన‌ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి త‌న దూకుడు కార‌ణంగా త‌నే ఇర‌కాటంలో ప‌డిపోతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది న‌ల్ల‌గొండ‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను చూస్తుంటే. అసెంబ్లీ వేదిక‌గా కోమ‌టిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున గెలిచి టీఆర్ ఎస్‌ లో చేరిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌ రావును రాజీనామా చేయాలని సవాల్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై గుత్తా మీడియాతో మాట్లాడుతూ కోమ‌టిరెడ్డి స‌వాల్‌ స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. అయితే త‌మ స‌వాల్‌ ను స్వీక‌రించే ద‌మ్ము కోమ‌టిరెడ్డికి లేద‌ని ఎద్దేవా చేశారు.

అడ్డ‌గోలు స‌వాల్ చేయడంలో ఆస‌క్తి చూపించ‌డం కాద‌ని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి స‌త్తా ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల‌ని గుత్తా ప్ర‌తి సవాల్ విసిరారు. భాస్క‌ర్ రావుతో పాటు తాము సవాల్ స్వీక‌రించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని, రాజీనామా కూడా చేస్తామ‌ని గుత్తా స్ప‌ష్టం చేశారు. కానీ ఈ విష‌యంపై కోమ‌టిరెడ్డి మౌనం చూస్తుంటే... ఆయ‌న‌కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకున్న‌ట్లుగా ఉంద‌ని గుత్తా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో ఆద‌ర‌ణ లేక‌, టీఆర్ఎస్‌లోకి రాలేక ఇబ్బందుల‌కు గురి అవుతూ కోమటిరెడ్డి మానసిక పరిస్థితి క్షీణిస్తోందని గుత్తా ఎద్దేవా చేశారు. జిల్లా స‌మ‌స్య‌ల్లో కోమ‌టిరెడ్డి స్పందిస్తున్న తీరు ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పారు. ఏఎంఆర్ ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వకపోతే పైపులైన్‌ ధ్వంసం చేస్తామని కోమ‌టిరెడ్డి అనడం సరైంది కాదని గుత్తా అన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అదేస్థాయిలో హుందాగా వ్యవహరించాలని సూచించారు. లేదంటే ప్ర‌జ‌లే స‌రైన పాఠం నేర్పుతార‌ని గుత్తా స్ప‌ష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/