Begin typing your search above and press return to search.
ప్రతిపక్షనేత వీక్ నెస్ మీద కొట్టారు
By: Tupaki Desk | 21 Jun 2016 10:43 AM GMTకాంగ్రెస్ నుంచి ఇటీవలే టీఆర్ ఎస్ లో చేరిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ తరఫున వాణి వినిపించడం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతున్న మల్లన్నసాగర్ నీటిపారుదల ప్రాజెక్టు విషయంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇరుకున పడేసే ప్రశ్నలు సందించారు. రైతులను రెచ్చగొట్టి ప్రాజెక్టును అడ్డుకోవాలని చూడటం మూర్ఖత్వమని అన్నారు.
మల్లన్నసాగర్ పై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని గుత్తా విమర్శించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు సీఎం కేసీఆర్ నిండు మనసుతో న్యాయం చేస్తున్నారని తెలిపారు. మల్లన్నసాగర్ విషయంలో గ్రామాలు మునుగుతున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువింద గింజ నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. పులిచింతల ప్రాజెక్టు కట్టినపుడు ఉత్తమ్ కుమార్ నియోజకవర్గంలోని 14 గ్రామాలు మునిగిపోలేదా? అని నిలదీశారు. అపుడు మాట్లాడని ఉత్తమ్ కుమార్ ఇప్పుడు తమకు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. పార్టీలకు అతీతంగా నిర్వాసితులకు అండగా నిలుద్దామని కోరారు. అభివృద్ధికి అడ్డుపడితే ప్రజలు సహించరని సందర్భానుసారం తమ తీర్పును వెలువరిస్తారని చెప్పారు. కాంగ్రెస్ నేతలెవరూ తమ నైతికతను ప్రశ్నించే అర్హతలేదన్నారు.
తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డిపై సైతం గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్థాయికి మించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గతాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డిని సాంఘిక బహిష్కరణ చేయాలని అన్నారు.