Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ లోకి గుత్తా..అని గుసగుసలు
By: Tupaki Desk | 9 Nov 2016 9:12 AM GMTఏనిమిషానికి ఏమి జరుగునో..? అన్న చందంగా ఉంది కాంగ్రెస్ మాజీ నేత - టీఆర్ ఎస్ లో చేరిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్. వాస్తవానికి ఈయనకు కాంగ్రెస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలంగాణ ఏర్పాటు , ఉద్యమం నేపథ్యంలో గుత్తా పెద్ద ఎత్తున ఢిల్లీలో లాబీయింగ్ చేశారని చెబుతారు. తెలంగాణ విషయంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాతోనూ పలు సార్లు ముఖాముఖి మాట్లాడి..ప్రత్యేక తెలంగాణ కోసం కాంగ్రెస్‌లో తన వంతుగా ఫైట్ చేశారు. అయితే, రాష్ట్రం సాకారమైన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేకపోవడం.. 2019 నాటికి కూడా కాంగ్రెస్ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే అంచనాలు లేకపోవడం... అదేసమయంలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కి తెరతీయడం తెలిసిందే.
ఈ క్రమంలోనే గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కారెక్కారు. నాడు జరిగిన ఫంక్షన్ లో గుత్తాతోపాటు చాలా మందే కేసీఆర్ సమక్షంలో కారెక్కారు. అయితే, అందరూ గులాబీ కండువా కప్పుకొన్నారు కానీ, గుత్తా మాత్రం కేసీఆర్ కు షేక్ హ్యాండిచ్చి సరిపెట్టారు. గుత్తా గులాబీ కండువా కప్పుకోకపోవడంతో అప్పట్లో పెద్ద సంచలనమైంది కూడా. గుత్తా టీఆర్ ఎస్ లో చేరి యేడాది కూడా కాలేదు అప్పుడే పరిస్థితి మారిపోయింది. ఎన్నో ఆశలతో కాంగ్రెస్ నుంచి వచ్చిన తనకు తన హోదాకి సరిపోయిన విధంగా టీఆర్ ఎస్ లో గౌరవం దక్కడం లేనది గుత్తా వాపోతున్నారట.
అంతేకాదు, సీఎం కేసీఆర్ కూడా గతంలో మాదిరిగా ఇప్పుడు తనతో ఇంటరాక్షన్ కావడంలేదని కూడా గుత్తా ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. దీనికితోడు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో అసలే పడట్లేదట గుత్తాకి. ఒకరకంగా గుత్తా ఒకటి చెబితే జగదీష్ మరోటి చేస్తున్నారట. దీంతో ఇక, తనకు టీఆర్ ఎస్ కి పడదని ఓ నిర్ణయానికి వచ్చారట గుత్తా. ఇదే విషయంపై ఆయన ఇటీవల మాట్లాడుతూ.. నేనేమన్నా టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నానా.. కేవలం కాంగ్రెస్ కి గుడ్ బై మాత్రమే చెప్పానని వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇక గుత్తా చిరకాల కోరిక అయిన మంత్రి పదవిపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నా అవి కూడా నెరవేరేలా లేవు. మరోపక్క, నల్లగొండలో కాంగ్రెస్ బలమైన నేతగా ఉన్న జానా రెడ్డితో ఇటీవల గుత్తా భేటీ అయ్యారని సమాచారం. ఈ సందర్భంగా తాను తిరిగి కాంగ్రెస్ గూటికి రావాలని డిసైడ్ అయినట్టు తన మనసులో మాటను గుత్తా బయటపెట్టుకున్నారట. ఈ క్రమంలో గుత్త కాంగ్రెస్ కి రావడం దాదాపు ఖరారైపోయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల నేపథ్యంలో తాను కాంగ్రెస్ లో ఉండడమే మంచిదని తన అనుచరులు చెబుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన జానాతో చెప్పినట్టు తెలిసింది. మరి ఈ క్రమంలో గుత్తా.. ఏ నిమిషానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో నని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/