Begin typing your search above and press return to search.

హైకోర్టు సంచలనం: బొట్టు పెట్టుకోనందుకు విడాకులు

By:  Tupaki Desk   |   30 Jun 2020 11:30 PM GMT
హైకోర్టు సంచలనం: బొట్టు పెట్టుకోనందుకు విడాకులు
X
గౌహతి హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహమైన హిందూ స్త్రీ నుదుటన సింధూరం.. చేతులకు గాజులు ధరించేందుకు అంగీకరించపోతే ఆమె ఆ వివాహాన్ని తిరస్కరించినట్టేనని గౌహతి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ విడాకుల పిటీషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది.

బొట్టు, గాజులు ధరించడమనేది హిందూ వధువు పాటించే ఆచారాలని.. వరుడితో వివాహాన్ని అంగీకరిస్తున్నట్టు ఇవి సూచిస్తాయని కోర్టు చెప్పింది. ఈ కారణాలతో ఆ భర్తకు కోర్టు విడాకులు కూడా మంజూరు చేసింది.

2012లో అసోంలో ఓ జంటకు పెళ్లి జరిగింది. అయితే పెళ్లైన నెలకే కుటుంబంతో విడిగా ఉందామని.. తాను సంప్రదాయాలు పాటించనని మొండికేసి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త, అత్తామామలపై గృహ హింస కేసు పెట్టింది.

భార్య ప్రవర్తనతో విసుగు చెందిన భర్త, విడాకుల కోసం హైకోర్టును ఆశ్రయించాడు. బొట్టు, గాజులు ధరించేందుకు ఇష్టపడడం లేదని.. తాను అవివాహితనని ప్రపంచానికి తెలియజేయాలని ఆమె భావిస్తోందని.. వివాహ బంధాన్ని కొనసాగించడం ఆమెకు ఇష్టం లేనట్టుగా ఉందంటూ హైకోర్టు లో వాదించాడు.

దీంతో హైకోర్టు హిందూ మహిళ వివాహం తర్వాత సింధూరం, మెట్టెలు ధరించడం సంప్రదాయమని ఇది భారతీయుల మనోభావాలకు సంబంధించిన విషయం అని..గౌరవించాలని సూచించింది. ఆ పనిచేయలేకుంటే వివాహ బంధానికి అర్థం లేదని పేర్కొంటూ.. ఆమెకు వివాహం ఇష్టం లేనట్టుగా ఉందంటూ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.