Begin typing your search above and press return to search.

అయోధ్య తీర్పు.. సోషల్ మీడియాలో బుక్ అయ్యారు!

By:  Tupaki Desk   |   10 Nov 2019 10:34 AM GMT
అయోధ్య తీర్పు.. సోషల్ మీడియాలో బుక్ అయ్యారు!
X
అయోధ్య తీర్పు విషయంలో తోచిన వ్యాఖ్యానాలు సరికావని ముందు నుంచినే నిపుణులు చెబుతూ వచ్చారు. ఇక ప్రభుత్వం, పోలీసులు కూడా ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేశారు. తీర్పు రాబోతున్న తరుణంలో ఎవరూ అనుచితమైన వ్యాఖ్యానాలు చేయవద్దని వారు సూచించారు.

మతపరమైన వ్యవహారం కావడంతో, తీర్పుపై ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఆఖరికి రాజకీయ పార్టీలు కూడా తమతమ వాళ్లకు హెచ్చరికలు జారీ చేశాయి. అనుచితంగా మాట్లాడి పార్టీ పరువు తీయవద్దని, లేనిపోని వివాదాలు సృష్టించవద్దని కూడా వారు సూచించారు.

అలా రాజకీయ పార్టీలు తమ వారిని కంట్రోల్ చేసుకున్నాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం కొందరు అతి చేశారు. అందుకు సంబంధించి ఇప్పుడు పర్యవసనాలను ఎదుర్కొంటూ ఉన్నారు.

అయోధ్య తీర్పుపై సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ముప్పై ఏడు మందిపై కేసులు నమోదు అయినట్టుగా తెలుస్తోంది. యూపీకి సంబంధించిన వీరందరిపై అక్కడి పోలీసులు కేసులు బుక్ చేశారు. అయోధ్య తీర్పు అనంతరం వీరు అనుచితమైన పోస్టులు పెట్టారని పోలీసులు నిర్ధారించారు.

ఆ పోస్టులను డిలీట్ చేయడించడమే కాకుండా, వారందరూ మతపరమైన గొడవలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందే హెచ్చరించినా, సోషల్ మీడియాలో కొంతమంది అనుచితంగా వ్యవహరించారు, ఇప్పుడు తీరికగా కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయోధ్య తీర్పుపై ఇంకా అతి చేయాలనుకునే మిగతా వాళ్లకు కూడా ఇదొక హెచ్చరికలాంటిదే.