Begin typing your search above and press return to search.
పొత్తు పేరిట బదనాం...కమలం కస్సుబుస్సు
By: Tupaki Desk | 6 Sep 2022 3:55 PM GMTఏపీలో రాజకీయం అంతా ఎక్కువగా మీడియా ద్వారానే జరిగిపోతుంది. నిజానికి దేశంలో చాలా రాష్ట్రాలలో మీడియా చైతన్యం ఎక్కువగా ఉన్నా ఏపీ వంటి చోట్ల రాజేకేయ అతి ఉత్సాహం మీడియా మోతుబరులు కొందరికి ఎక్కువ అని ప్రచారం లో ఉన్న మాట. అదే విధంగా వారు కొన్ని పార్టీలకు అనుకూలంగా ఉంటూ తమ సర్వస్వం ధారపోస్తున్న వైనాలు కూడా ఎన్నో. ఈ నేపధ్యంలో ఏపీలో విపక్షంలో ఉన్న టీడీపీ విషయంలో కూడా ఒక వర్గం మీడియా జోరు చేస్తోంది అనే అంటున్నారు.
ఆ మీడియా ఏకంగా పొత్తుల దాకా కధను నడుపుతోందని అంటున్నారు. అదే ఇపుడు జాతీయ స్థాయిలో బలంగా ఉంటూ కేంద్రంలో అధికారాన్ని చలాయిస్తున్న బీజేపీ పెద్దలకు కంటగింపుగా మారింది అని అంటున్నారు. గత కొద్ది రోజులుగా చూస్తే ఏపీలో టీడీపీకి బీజేపీకి మధ్య పొత్తులు ఉన్నాయంటూ వచ్చిన వార్తలు యావత్తు రాజకీయాన్నే కకావికలు చేస్తోంది.
ఏపీలో చూస్తే బీజేపీతో 2014 నాటి పొత్తుని కొనసాగించాలని టీడీపీ చాలా కాలంగా భావిస్తోంది. ఇందుకోసం చేయని ప్రయత్నం లేదు అని కూడా చెబుతారు. అదే టైం లో బీజేపీ పెద్దలను కలవాలని కూడా టీడీపీ హై కమాండ్ గతంలో ప్రయత్నాలు చేసింది. అయితే గత నెలలో జరిగిన ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రానికి ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు ఎట్టకేలకు మూడేళ్ళ సుదీర్ఘ కాలం తరువాత ప్రధాని మోడీతో కరచాలనం చేయగలిగారు.
ఆ తరువాత నుంచే ఈ పొత్తుల వార్తలు అధికం అయ్యాయి. దానికి ఆలంబన అన్నట్లుగా కేంద్ర మంత్రి అమిత్ షా ఈ మధ్య తెలంగాణ పర్యటనలో ఏకంగా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి అక్కడ మీడియా టైకూన్ ని కలిసి వచ్చారు. ఇంకేముంది పొత్తులు కుదిరిపోయినట్లే అని వార్తలు వినిపించాయి. దాంతో మెయిన్ స్ట్రీం మీడియానే కాకుండా సోషల్ మీడియాలో దీని మీద పుంఖానుపుంఖానులుగా వార్తలు వచ్చేశాయి.
ఈ విషయం చాలా దూరం వెళ్ళిపోయింది. దసరా తరువాత ఏ క్షణం అయినా పొత్తుల ప్రకటన రావచ్చు అని కూడా వార్తలు వండి వార్చేశారు. మరి అవి ఎవరు చేశారు, తెర వెనక ఎవరు ఉన్నారు అన్నది పక్కన పెడితే పొత్తులు ఖాయమన్న వార్తల మీద కమలనాధులు గుర్రు మీద ఉన్నట్లుగా ఢిల్లీ తాజా కబురు స్పష్టం చేస్తోంది. ఏపీలో తమ పార్టీని సొంతంగా బలోపేతం చేయాలని బీజేపీ ఆలోచిస్తోంది
దానికి ఆటంకంగా ఉన్న టీడీపీ ఓటు బ్యాంక్ ని తమ వైపునకు తెచ్చుకోవాలని కూడా చూస్తోంది. అయితే అదే టీడీపీతో పొత్తుని అంటకట్టి వార్తలు రాయడం పట్ల మాత్రం బీజేపీ పెద్దలు మండుతున్నారన్ అంటున్నారు. అసలు పొత్తులు ఉండాలా కూడదా అని ఆలోచించడానికి ఇది టైం కాదనే వాదన కూడా ఉందిట. ఈ నేపధ్యంలో ఆదికి ముందు పొత్తు వార్తలు తామరతంపరగా రావడం పట్ల బీజేపీ పెద్దలు గుస్సా అవుతున్నారుట.
ఇక ఈ పొత్తు వార్తల పట్ల ఏపీలోని బీజేపీ పెద్దలు ఎవరూ ఇప్పటిదాకా గట్టిగా ఖండించలేదు. సునీల్ డియోధర్ మాత్రమే దీని మీద కౌంటర్ ఇచ్చారు. ఎవరో ఏదో రాసుకుంటే పొత్తులు కుదరవు అని ఆయన అంటూ వచ్చారు. అయితే ఈ పొత్తు వార్తల మీద సీరియస్ గా ఉన్న బీజేపీ హై కమాండ్ వెంటనే ఖండించాలని సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు జీవీఈల్ నరసిం హారావును పురమాయించినట్లుగా ప్రచారం సాగింది.
దాని ఫలితంగానే ఆయన లేటెస్ట్ గా విస్పష్టమైన ప్రకటన చేశారు అని అంటున్నారు. తమకు ఏపీలో పొత్తు ఉన్నది కేవలం జనసేనతోనే అని ఆయన చెప్పుకొచ్చారు. తమ రెండు పార్టీలు వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది కూడా ఎవరికి వారుగా బలపడాలన్న ఉద్దేశ్యం తప్ప ఎటువంటి గ్యాప్ లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. తమకు టీడీపీతో పొత్తులు అన్నవే లేవు అని కూడా చెప్పుకొచ్చారు.
అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేయడంపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2024 నాటికి ఏపీలో తాము అధికారంలోకి వస్తామని ఆయన ధీమాగా చెప్పారు. మొత్తానికి ప్రస్తుతానికి పొత్తు వార్తల మీద బీజేపీ హై కమాండ్ ఖండించడంతో ఇవి ఆగినట్లు అనిపించినా వీటికి పూర్తిగా బ్రేక్ వేయడం అన్నది జరిగే పని కాదని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.