Begin typing your search above and press return to search.
మీకు తెలుసా? బీజేపీది కూడా టీడీపీ సిద్ధాంతమేనట!
By: Tupaki Desk | 7 May 2019 7:27 AM GMTమీకు గుర్తుందా?.. తెలంగాణ ఉద్యమ సమయంలో మీ సిద్ధాంతం ఏంటని ప్రశ్నించిన మీడియాకు చంద్రబాబు చెప్పిన సమాధానం అప్పట్లో తెగ వైరల్ అయింది. తమది రెండు కళ్ల సిద్ధాంతమని - రెండు ప్రాంతాలు తమకు సమానమేనని చంద్రబాబు చెప్పిన సమాధానాన్ని అప్పట్లో తెలంగాణ వాదులు ఎద్దేవా చేశారు. ఏదో ఒకదానికే కట్టుబడి ఉండాలని హితవు పలికారు. చంద్రబాబు చెప్పిన ఈ ఒక్క సిద్ధాంతం ఆయనను చాలాకాలం వెంటాడింది. ‘రెండు కళ్ల బాబు’ అంటూ ప్రత్యర్థులు చంద్రబాబును ఎద్దేవా చేయడం మొదలు పెట్టారు. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్లీ బీజేపీ నేతలు ఇదే సిద్ధాంతాన్ని మళ్లీ బయటకు తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల విషయంలో తమది రెండు కళ్ల సిద్ధాంతమని బీజేపీ అధికార ప్రతినిధి - ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పుకొచ్చారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికీ తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని సెలవిచ్చారు. పనిలో పనిగా ఏడాదిన్నరగా తమకు శత్రువుగా మారిన చంద్రబాబుపైనా నిప్పులు కురిపించారు.
ఏపీ ప్రయోజనాలను దెబ్బతీసింది చంద్రబాబేనని విరుచుకుపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు టీఆర్ ఎస్ తో చీటికి మాటికి గొడవ పడుతున్నారని ఆరోపించారు. పోలవరంలో తన వాటా వచ్చిందో - లేదో తెలుసుకునేందుకే చంద్రబాబు సోమవారం పోలవరం వెళ్లరాని ఆరోపించారు. ఈ నెల 10న చంద్రబాబు కేబినెట్ మీటింగ్ నిర్వహించనున్నట్టు వస్తున్న వార్తలపైనా జీవీఎల్ స్పందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మీటింగ్ ఎలా పెడతారని ప్రశ్నించారు.