Begin typing your search above and press return to search.
ఏపీలో జిల్లాకు రంగా పేరు పెట్టాలి...జీవీఎల్ రాజకీయ గడుసుతనం
By: Tupaki Desk | 13 Feb 2023 2:42 PM GMTఏపీలో ఒక జిల్లాకు కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలి. ఇది బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన డిమాండ్. ఈ రోజు పెద్దల సభ ప్రారంభం కాగానే జీరో అవర్ లో జీవీఎల్ ఈ మేరకు డిమాండ్ చేశారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఏ విషయం మీద అయినా జీరో అవర్ లో మాట్లాడవచ్చు. దీన్ని సావకాశంగా తీసుకున్న జీవీఎల్ ఈ డిమాండ్ చేసి తన రాజకీయ గడుసుతనం చాటుకున్నారు.
అయితే ఏపీలో పదమూడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలుగా మారి అపుడే ఏడాది దగ్గర కావస్తోంది. వంగవీటి రంగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు చెందిన వారు. కాబట్టి ఆయన పేరుని అయితే ఎన్టీయార్ పేరిట ఏర్పడిన జిల్లాలో లేక మచిలీపట్నం జిల్లాకో పెట్టాలి. కొత్త జిల్లాల మీద రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నపుడో లేక పేర్లు ప్రతిపాదిస్తున్నపుడో బీజేపీ ఈ డిమాండ్ చేసి ఉంటే సార్ధకత ఉండేది.
అది కూడా ఏపీ చట్ట సభలలో డిమాండ్ చేయాలి. బీజేపీకి శాసనమండలిలొ ఎమ్మెల్సీలు ఉన్నారు. అక్కడ ఇలాంటి డిమాండ్ చేస్తే సహేతుకంగా ఉండేది. కానీ అక్కడ చేయలేదు. బయటా అయినా ఏపీ బీజేపీ నేతలు పార్టీ ఫోరం మీద కూడా చేసిన దాఖలాలు లేవు. కానీ ఇపుడు పెద్దల సభలో ఒక రాష్ట్రంలోని జిల్లాకు ఒక నాయకుడి పేరు పెట్టాలని జీవీఎల్ చేసిన డిమాండ్ సందర్భం లేకుండా ఉందని అంటున్నారు.
దీని వెనక జీవీఎల్ రాజకీయ ఉద్దేశ్యాలు తప్ప మరేమీ లేవని అంటున్నారు. జీవీఎల్ ఈ మధ్య కాపు నినాదం అందుకున్నారు. నాడు చంద్రబాబు ప్రభుత్వం ఆర్ధికంగా వెనకబడిన వర్గాలకు ఇచ్చే పది శాతం కోటాలో కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు ఇచ్చింది. దాని మీద రాజ్యసభలో ప్రశ్న వేసి ఆ రిజర్వేషన్లు చట్ట సమ్మతమే అని సమాధానం రాబట్టిన జీవీఎల్ కాపులకు అలా దగ్గర అయ్యారు.
దాంతో కాపులు ఆయనను సన్మామించారు. ఇపుడు ఆయన వంగవీటి రంగా పేరుతో కొత్త జిల్లా అంటూ పార్లమెంట్ లో గళమెత్తడం ద్వారా కాపులకు మరింత సన్నిహితం కావాలని చూస్తున్నారు. అందుకే ఆయన ఇపుడు సడెన్ గా కాపుల ఆరాధ్య దైవం అయిన వంగవీటి మోహన రంగా పేరిట కొత్త జిల్లా అని ఆయన డిమాండ్ చేస్తున్నారు అని అంటున్నారు. జీవీఎల్ ఆశలు బాగానే ఉన్నాయి. ఆయన ఆకాంక్షలు బాగానే ఉన్నాయి.
అయితే ఎక్కడ డిమాండ్ ఎక్కడ చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారు అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్నగా ఉంది. జీవీఎల్ అతి ఉత్సాహంతో కాపుల ఓట్లకు గేలం వేస్తున్నారు అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. దాంతో కాపులను మచ్చిక చేసుకోవాలని చూస్తున్నారు. అయితే ఒకచోట చేయాల్సిన డిమాండ్ మరో చోట చేయడం ద్వారా ఆయన తన చిత్తశుద్ధిని చాటుకోవడం అటుంచి అది బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంది అని అంటున్నారు.
ఇప్పటికే ఆయన మీద బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ సెటైర్లు కూడా వేశారు. కాపులకు ఏమి చేశారని జీవీఎల్ కి సన్మానాలు చేస్తారంటూ ఒక పాయింట్ ని ఆయన రైజ్ చేశారు. రానున్న రోజుల్లో జీవీఎల్ ఈ అతి ఉత్సాహంతో మరిన్ని విమర్శలను సొంత పార్టీ నుంచే కాదు ఇతర పార్టీల నుంచి ఎదుర్కొంటారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఏది ఏమైనా జీరో అవర్ అంటే ఏదైనా మాట్లాడవచ్చు అన్న వెసులుబాటుతో రంగా పేరుని తలచిన జీవీఎల్ కి అంత సులువుగా కాపుల మద్దతు దక్కుతుందా అన్నదే కీలకమైన ప్రశ్నగా ఉంది అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.