Begin typing your search above and press return to search.
అఖిలేష్ చిటికేస్తే ఢిల్లీలో బాబు ప్రత్యక్షం:జీవీఎల్
By: Tupaki Desk | 1 Nov 2018 7:38 AM GMTనేడు ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ కాబోతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబుకు అఖిలేష్ ఫోన్ చేశారని....బీజేపీ వ్యతిరేక విపక్ష కూటమికి చంద్రబాబును నాయకత్వం వహించాల్సిందిగా కోరారని...మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు-రాహుల్ భేటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా స్థాపించిన టీడీపీ....అదే పార్టీతో తెలంగాణతో పాటు - జాతీయ స్థాయిలోనూ చేతులు కలపడం ఏమిటని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారతారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. చంద్రబాబుపై తన మార్క్ కామెంట్స్ తో జీవీఎల్ మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యే అయినపుడు...అఖిలేష్ 5 ఏళ్ల చిన్న పిల్లాడని - కానీ ఇపుడు అఖిలేష్ చిటికేస్తే...చంద్రబాబు ఢిల్లీకి పరిగెట్టేందుకు సిగ్గులేదని ట్వీట్ చేశారు. అందరికన్నా సీనియర్ అని చెప్పుకునే బాబు ఇలా ఢిల్లీ వెళ్లడం...తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కించపరచడం కాదా అని ప్రశ్నించారు.
``చంద్రబాబు నాయుడు గారు 1978 లో MLA -1980 లో మంత్రి అయ్యారు. అప్పుడు 5 ఏళ్ల వయసున్న అఖిలేష్ యాదవ్ డైపర్లు వేసుకునే వయసు వాడు. అందరి కంటే సీనియర్ ను అని చెప్పుకునే @ncbn కి 'బచ్చా' అఖిలేష్ చిటికేస్తే ఢిల్లీకి వెళ్ళటం సిగ్గనిపించటం లేదా?ఇది తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కించపరచడం కాదా?``అని జీవీఎల్ ట్వీట్ చేశారు. టీడీపీ ప్రభుత్వం...అనేక కుంభకోణాలకు పాల్పడిందని...పన్ను ఎగవేత - ఇరిగేషన్ స్కామ్ లు - పీడీ ఖాతాలు...వంటి అనేక వ్యవహారాల నేపథ్యంలో నేడు చంద్రబాబు ఢిల్లీలో అవినీతి పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎంపీలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయని - అందుకే బాబు ఢిల్లీకి బలపం కట్టుకొని తిరుగుతున్నారని ఆరోపించారు.