Begin typing your search above and press return to search.

రాజ‌కీయ ముసుగులో బాబు అవినీతి:జీవీఎల్

By:  Tupaki Desk   |   31 Oct 2018 12:33 PM GMT
రాజ‌కీయ ముసుగులో బాబు అవినీతి:జీవీఎల్
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న ఇరు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ‌వ్యాప్తంగా పెను సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఆప‌రేష‌న్ గ‌రుడ‌లో భాగంగా ఈ దాడి జ‌రిగింద‌ని - ఏపీపై కేంద్రం కుట్ర‌లో భాగంగానే ఇలా జ‌రిగింద‌ని టీడీపీ నేత‌లు అర్థం ప‌ర్థం లేని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని బీజేపీ నేత‌లు మండిప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. ఆప‌రేష‌న్ గ‌రుడ అంటూ కొత్త నాట‌కానికి తెర‌లేపిన శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకొని ఎందుకు విచార‌ణ చేయ‌ర‌ని బీజేపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబు - శివాజీల‌పై జీవీఎల్ నిప్పులు చెరిగారు. `రెండో బ్రహ్మం గారు` అయిన శివాజీ చెప్పినట్లు చంద్రబాబు నడుచుకుంటున్నారని, అందుకే `ఆప‌రేష‌న్ పేడ`అంటూ అవాకులు చ‌వాకులు పేలుతున్నార‌ని జీవీఎల్ మండిప‌డ్డారు. రాజకీయ ముసుగులో ఏపీలో కొత్త త‌ర‌హా అవినీతికి చంద్ర‌బాబు తెరలేపారని జీవీఎల్ ఆరోపించారు.

స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ జ‌యంతి సంద‌ర్భంగా క‌డ‌ప‌లో నిర్వ‌హించిన ర్యాలీలో పాల్గొన్న జీవీఎల్...చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు. క‌డ‌పలో ఉక్కు ఫ్యాక్ట‌రీ కోసం దీక్ష‌లు చేశార‌ని - కానీ, ప్రభుత్వం సరైన రిపోర్ట్ ఇవ్వకపోవడం వల్లే కడప ఉక్కు ఫ్యాక్ట‌రీ ఆలస్యం అవుతోంద‌ని వివరించారు. చంద్రబాబు సొంత స్క్రిప్టులు రాయ‌డం మానుకోవాలని జీవీఎల్ సూచించారు. రాజ‌కీయ నాయకులు - వ్యాపార‌వేత్త‌ల ఇళ్ల‌పై ఐటీ సోదాలు జ‌ర‌గ‌డ స‌ర్వ సాధార‌ణం అని అన్నారు. ఆ సోదాల‌కు సీఎం రమేష్ బెంబేలెత్తిపోతున్నారని ఎద్దేవా చేశారు. అయినా, స‌క్ర‌మంగా ప‌న్ను క‌ట్టేవారు - లెక్క‌లు చూపించేవారికి భ‌యం ఉండ‌ద‌ని చెప్పారు. అటువంట‌పుడు సోదాల‌పై టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిప‌డుతున్నార‌ని ప్ర‌శ్నించారు. సక్రమంగా పన్నులు కడితే టీడీపీ నేత‌లు భయప‌డాల్సిన అవ‌స‌ర‌మేమిట‌ని ప్రశ్నించారు. అఖిలేష్ పిలిస్తే...ఢిల్లీకి పరుగుపెడుతోన్న బాబు...జాతీయ విప‌క్ష కూట‌మికి నాయ‌క‌త్వం వ‌హించబోతున్నార‌ని టీడీపీ నేత‌లు ప్ర‌చారం చేయ‌డం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు. ఏపీలో తెలుగుదేశానికి ఒక్క ఎంపీ సీటు కూడా రాదన్నారు. ధ‌ర్మ‌ దీక్షల పేరుతో చంద్ర‌బాబు ప్రజాధనాన్ని దుర్వినియోగప‌రుస్తున్నార‌న్నారు. త‌న సొంత జిల్లా చిత్తూరులో మీటింగ్ లు పెట్టడం తప్ప చంద్ర‌బాబు చేసిన అభివృద్ధి ఏమీ లేద‌న్నారు.