Begin typing your search above and press return to search.
మోడీతో జగన్ భేటీపై జీవీఎల్ ఏం చెప్పారు?
By: Tupaki Desk | 8 Aug 2019 10:03 AM GMTఏదైనా అంశాన్ని పట్టుకుంటే దాని లెక్క తేలే వరకూ విడిచిపెట్టని వైనం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతం. విపక్ష నేతగా ఏపీ ప్రత్యేక హోదా కోసం ఆయన చెబుతున్న మాటలు.. ఇచ్చిన హామీల్ని.. ముఖ్యమంత్రి అయ్యాక కూడా వదిలిపెట్టటం లేదు. అదే పనిగా ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని వివిద వేదికల మీద ప్రస్తావిస్తూ మోడీ పరివారానికి చిరాకు తెప్పిస్తున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నెల వ్యవధిలోనే కీలకమైన వివిధ వేదికల మీద ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరాన్ని జగన్ స్పష్టం చేయటం తెలిసిందే. తాజాగా ప్రధాని మోడీతో భేటీ అయిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దాదాపు 45 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఈ సమావేశం పాజిటివ్ గా జరిగినట్లు చెబుతున్నా.. తాజాగా మోడీషాలకు అత్యంత సన్నిహితుడిగా చెప్పే బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయని చెప్పక తప్పదు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడ చేశారన్న దాని కంటే ప్రజలకు ఎలా చేరువ కావాలో మాత్రమే ఆలోచించాలని వ్యాఖ్యానించారు. చాలా కష్టపడ్డానంటూ వ్యాఖ్యలు చేయకూడదన్నారు. కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. గతంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల మాదిరే ఉన్నాయని తప్పు పట్టటం గమనార్హం. అంతేకాదు.. మోడీతో భేటీ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమన్న విషయాన్ని మరోసారి జగన్ ప్రస్తావించటం తెలిసిందే.
ఈ అంశాన్ని గుర్తు చేస్తూ.. గతంలో సాధ్యం కావని చెప్పిన అంశాల్ని అదే పనిగా జగన్ ప్రభుత్వం మళ్లీ మళ్లీ అడగటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుకి సాధ్యం కావని చెప్పిన అంశాలు జగన్ కూడా వర్తిస్తాయని జీవీఎల్ పేర్కొనటం చూస్తే.. మోడీ బ్యాచ్ సందేశం ఏమిటన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసినట్లుగా చెప్పాలి. ఓపక్క జగన్ మాటల్ని తప్పు పట్టినట్లుగా వ్యాఖ్యలు చేస్తూనే.. మరోవైపు జగన్ సర్కారు తీసుకున్న కొన్ని నిర్ణయాల్ని జీవీఎల్ సమర్థించటం కనిపిస్తుంది.
తప్పులు జరిగినప్పుడు కాంట్రాక్టు రద్దు చేయటం తప్పు కాదన్నారు. కాంట్రాక్టు రద్దు చేస్తే బాధపడాల్సిన అవసరం ఏముందన్న మాటలు చూస్తే.. జగన్ నిర్ణయాలపై మోడీ పరివారం సానుకూలంగా ఉందన్న భావన కలుగక మానదు. మొత్తంగా జీవీఎల్ మాటల్ని చూస్తే.. అర్థమయ్యేది ఒక్కటే తమకు నచ్చని.. చిరాకు తెప్పించే అంశాల్ని చర్చకు తేకుండా జగన్ తన పాలన తాను చేసుకోవచ్చన్న మాటను చెప్పినట్లుగా చెప్పక తప్పదు.