Begin typing your search above and press return to search.
ఇలాంటి తెలుగోడుతో ఏపీకి హోదా ఎందుకు వస్తుంది?
By: Tupaki Desk | 2 Feb 2020 4:37 AM GMTతెలుగోళ్లను కొందరు కప్పలతో పోలుస్తుంటారు. ఒక కప్ప పైకి పాకుతుంటే.. మరో కప్ప దాన్ని కిందకు లాగేసే రీతిని గుర్తు చేసేలా తెలుగు ప్రజల తీరు ఉంటుందని వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తుంటారు. తెలుగోళ్లలో తెలంగాణ ప్రజలతో పోలిస్తే.. ఏపీ ప్రజల్లో ఇలాంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాలి. మిగిలిన సందర్భాల్లో ఎలా ఉన్నా.. తమ ప్రాంత ప్రయోజనాలకు భంగం వాటిల్లితే మాత్రం ఊరుకోరు. తమను దెబ్బేసేటోడు ఎవరన్నది చూడకుండా ముందుకెళ్లే తీరు తెలంగాణ ప్రజల్లో కనిపించినంత ఎక్కువగా ఏపీ ప్రజల్లో అస్సలు కనిపించదు.
తమ ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా నిర్ణయాలు తీసుకుంటే.. తోపులాంటి నేతల్ని సైతం కడిగేయటం తెలంగాణ ప్రజల్లో కనిపిస్తుంది. తమ కళ్ల ముందే తమకిచ్చిన ప్రత్యేక హోదా హామీని గంగలో కలిపేస్తూ మోడీ సర్కారు వ్యవహరిస్తున్నా ఏమీ అనకుండా చేష్టలుడిగిపోయినట్లుగా వ్యవహరించటంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారి తర్వాతే ఎవరైనా అన్న మాట వినిపిస్తుంటుంది. ఆ మాటలో నిజమెంతన్న విషయం తాజాగా బీజేపీ నేత.. మోడీకి అత్యంత సన్నిహితుడు తెలుగోడైన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ మాటల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు.
ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా విషయంలో ఆశలు వదులుకోవాలని ఇప్పటికే మోడీకి అత్యంత సన్నిహితంగా ఉండే బీజేపీ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. కన్నతల్లిని నష్టం జరిగేలా వ్యవహరిస్తే ఏ ఒక్కరికైనా ఒళ్లు మండుతుంది. కానీ.. అదేం సిత్రమో కానీ కన్నతల్లి లాంటి ఏపీకి నష్టం వాటిల్లేలా మోడీ సర్కారు చర్యలకు జీవీఎల్ లాంటోళ్లు తానా అంటే తందానా అనేయటం కనిపిస్తుంది.
తాజా బడ్జెట్ చప్పగా ఉందంటూ విపక్షాలు.. ఇతర రంగాలకు చెందిన వారు ప్రస్తావిస్తున్న వేళ.. తమ బడ్జెట్ ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? అంటూ జీవీఎల్ గొప్పలు చెప్పుకున్నారు. అంతేకాదు.. రాష్ట్రాల అంశాల ప్రాతిపదికన కేంద్ర బడ్జెట్ ను చూడకూడదన్న గొప్ప విషయాన్ని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనని గతంలోనే తాను చెప్పానని.. తాజాగా మరోసారి స్పష్టం చేస్తున్నట్లు చెప్పారు.
ఇంత విస్పష్టంగా ప్రత్యేక హోదాకు హ్యాండిచ్చిన మోడీ సర్కారుపై ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయటం మాని.. తమకేమీ పట్టనట్లుగా ఉండటం వారికి మాత్రమే సాధ్యమన్న మాట వినిపిస్తోంది. ఏపీ ప్రజలకు వారి సొంత ప్రయోజనాలు తప్పించి.. రాష్ట్ర ప్రయోజనాలు పెద్దగా పట్టవన్న వైనం కొట్టొచ్చినట్లు కనిపించక మానదు. ఈ తీరును గుర్తించే జీవీఎల్ లాంటోళ్లు ఏపీకి హోదా విషయంలో ఇచ్చిన హామీని గంగలో కలిపేసినట్లుగా కనిపిస్తుంది. సాటి తెలుగోడిగా ఏపీ మీద జీవీఎల్ లాంటోళ్లకు కనీస ప్రేమాభిమానాలు లేనప్పుడు.. ప్రధాని మోడీకి ఉంటాయనకోవటం అత్యాశే అవుతుంది సుమా.