Begin typing your search above and press return to search.
జీవీఎల్ జోస్యం!... ఏపీలో ఒక్క మంత్రీ గెలవడు!
By: Tupaki Desk | 28 March 2019 1:30 PM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ నెలకొందనే చెప్పాలి. గడచిన ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీ ఇప్పుడు ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో బీజేపీతో టీడీపీ పొత్తుకు మంగళం పాడేసింది. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో ఇటు బీజేపీతో పాటు అటు టీడీపీ కూడా ఒంటరి పోరుకే దిగక తప్పలేదు. ఎన్నికలకు రంగం సిద్ధం కాకముందు నుంచే ఇరు పార్టీల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ కొనసాగుతన్నాయి.
టీడీపీ సంధించే విమర్శలకు కౌంటర్లిచ్చే బాధ్యతను కమలం పార్టీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావుకు అప్పగించేసింది. రాజ్యసభ సీటిచ్చి మరీ ఏపీలోకి జీవీఎల్ ను ఏపీలోకి చొప్పించేస్తే... ఆయన టీడీపీపై తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన జీవీఎల్.... టీడీపీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అతి తక్కువ స్థానాలే వస్తాయని పేర్కొన్న ఆయన టీడీపీ ఎన్ని సీట్లు సాధిస్తుందన్న అంశంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి ఈ ఎన్నికల్లో 18 సీట్ల కంటే కూడా తక్కువగానే వస్తాయని పేర్కొన్న జీవీఎల్... చంద్రబాబు కేబినెట్ లోని ఒక్క మంత్రి కూడా గెలవడని తేల్చేశారు.
తెలంగాణలో టీడీపీకి ఏ గతైతే పట్టిందో... ఏపీలో కూడా అదే గతి పడుతుందని ఆయన జోస్యం చెప్పారు.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే మమతా బెనర్జీకి పట్టిన గతే పడుతుందని ఆయన హెచ్చరించారు. కేంద్రం సీమకు హైకోర్టును మంజూరు చేస్తే చంద్రబాబు నిర్మించలేదని విమర్శించిన జీవీఎల్... 52 స్థానాలే ఉన్నాయని రాయలసీమను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. మొత్తంగా ఓటమి అంచున నిలబడిందని టీడీపీపై విశ్లేషణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జీవీఎల్ ఆ పార్టీ హీనాతిహీనంగా ఓడిపోతుందని మరో సంచలన కామెంట్ చేశారు.