Begin typing your search above and press return to search.
అమరావతికి కేంద్రం ఓకే.. జీవీఎల్ సంచలన ప్రకటన
By: Tupaki Desk | 19 Dec 2021 9:32 AM GMTఏపీ రాజధాని అమరావతి విషయంలో గతంలో బీజేపీ సీనియర్ నాయకుడు.. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో.. అందరికీ తెలిసిందే. ఒకానొక దశలో ఆయన అప్పటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షు డు.. కన్నా లక్ష్మీనారాయణతోనూ విభేదించారు. రాజధాని అంశం.. రాష్ట్ర పరిధిలోదని.. ఈ విషయంలో బీజేపీకి క్లారిటీ ఉందని.. కేంద్రం కూడా ఇదే విషయాన్ని పార్లమెంటులో చెప్పిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మీడియా నుంచి వచ్చిన ప్రశ్నలకు కూడా ఆయన దీటుగానే సమాధానం చెప్పారు. ఇలా ఆది నుంచి అమరావతిపై దూకుడుగా వ్యవహరించిన జీవీఎల్ ఇప్పుడు అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు.
ఏపీ రాజధాని అమరావతేనని నరసింహారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని ఒప్పుకుందని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకుపోయారని విమర్శించారు. రెండు దశాబ్దాలుగా చేసిన అప్పులకంటే వైసీపీ రెండున్నరేళ్ల పాలనలోనే రెట్టింపు అప్పులు చేశారన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ. 25800 కోట్లు ఖర్చు చేసిందని జీవీఎల్ తెలిపారు.
రాష్ట్రంలో మూడు కారిడార్‌లు, 5 పారిశ్రామిక నగరాల అభివృద్ధికి 80 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర వాటా నిధులు ఇప్పటికీ మంజూరు చేయలేదని ఆయన విమర్శించారు. ఉపాధిహామీ పథకానికి దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులను ఏపీకి కేంద్రం ఇచ్చింద ని తెలిపారు. కృష్ణా, గోదావరి బోర్డుల ఏర్పాటుకు డీపీఆర్‌లు ఇవ్వాలని కోరినా... ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని తప్పుబట్టారు.
ఈ ఏడాదిలోనే రెవెన్యూలోటు పూడ్చడంలో భాగంగా రూ.11,600 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్నా... జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని దివాలా స్థాయికి తీసుకెళ్లారని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. అయితే.. రాజధాని విషయంలో జీవీఎల్ ఇలా యూటర్న్ తీసుకోవడం.. వెనుక..కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కొన్నాళ్ల కిందట తిరుపతి పర్యటనకు వచ్చిన షా.. ఇక్కడి పాదయాత్ర పై.. ఆరాతీశారు. ఈ క్రమంలోనే.. అమరావతికి మద్దతివ్వాలని ఇక్కడి నేతలను కోరడం..వారు వెంటనే పాదయాత్రకు జైకొట్టడం తెలిసిందే. ఇప్పడు జీవీఎల్ కూడా అమరావతి ఎక్కడికీ పోదని.. దీనికి కేంద్రం కూడా కట్టుబడి ఉందని వ్యాఖ్యానించడం రాజకీయంగానే కాకుండా.. అన్ని వర్గాల నుంచి కూడా హర్షం వ్యక్తమవుతుండడం గమనార్హం.