Begin typing your search above and press return to search.
మహిళ మర్మాంగంలో 8 కోట్ల డ్సగ్స్ ..!
By: Tupaki Desk | 7 March 2020 1:06 PM GMTదొంగతనం చేయాలనుకునేవాడికి సవాలక్ష దారులు అన్నట్టుగా .. డ్రగ్స్ మాఫియా ని అరికట్టడానికి ప్రభుత్వాలు - పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ .. ముఠా సభ్యులు రోజుకో కొత్త ప్లాన్ తో డ్రగ్స్ ని సరఫరా చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా విదేశాల నుంచి అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న మహిళను బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఏకంగా రూ. 8 కోట్ల విలువైన కొకైన్ ను మర్మాంగం లో దాచిపెట్టుకుని బయటకి రావాలని ప్రయత్నం చేసింది. అయితే , ఆ మహిళ ప్రవర్తనలో తేడా గమనించిన కస్టమ్స్ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేస్తే అసలు విషయం బయటపడింది. దీనితో ఆమె వెనుక ఎవరున్నారు అని తెలుసుకోవడానికి ఆ మహిళని విచారణ చేస్తున్నారు.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. సౌత్ అమెరికాలోని గ్వాట్ మాలా ప్రాంతానికి చెందిన మహిళ ఫిబ్రవరి 2వ తేదీన ET- 690 ఎయిర్ లైన్స్ విమానంలో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంది. ఆ తర్వాత లగేజ్ బ్యాగ్ తో ఎయిర్ పోర్ట్ నుండి బయటకు రావడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో ఎయిర్ పోర్టు అధికారులు సౌత్ అమెరికా మహిళను సోదాలు చేశారు. అయితే - ఎయిర్ పోర్ట్ అధికారులు సోదాలు చేస్తున్న తరుణంలో ఆ విదేశీ మహిళ అయోమయానికి గురికావడంతో అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు అత్యాధునిక పరికరాలతో పరిశీలించి, మహిళ దగ్గర డ్రగ్స్ ఉన్నాయని అధికారులు గుర్తించారు.
అయితే, ఆ మహిళ వద్ద డ్రగ్స్ ఉన్నాయని మహిళా అధికారులు గుర్తించినా కూడా ,అవి ఎక్కడ ఉన్నాయన్న విషయం చాలా సేపు ఎవరికీ అంతుచిక్కలేదు. దీనితో ఆ విదేశీ మహిళని అదుపులోకి తీసుకోని తమదైన రీతిలో విచారణ చేయగా ..ఆమె తన మర్మాంగంలో కొకైన్ ఉందని అంగీకరించింది. మొత్తం 150 క్యాప్సిల్స్ లో కొకైన్ నింపుకుని వాటిని ఆమె మర్మాంగంలో దాచిపెట్టినట్లు చెప్పింది.మర్మాంగంలో డగ్స్ కరిగిపోకుండా క్యాప్సిల్స్ అలాగే ఉంటాయని, ఆ టెక్నాలజీని వాడుకొని డ్రగ్స్ ని సరఫరా చేయాలనీ చూసారని అధికారులు తెలిపారు.