Begin typing your search above and press return to search.
ట్రంప్ ఇంకో దెబ్బ కొట్టాడు..హెచ్4 వీసాల షాక్
By: Tupaki Desk | 27 May 2019 3:39 PM GMTఅవకాశాల స్వర్గదామంగా పేరొందినప్పటికీ, గత కొద్దికాలంగా ఆంక్షల పరంపరకు సుపరిచిత చిరునామాగా మారిన అమెరికాలో మరో షాకింగ్ వార్త తెరమీదకు వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు. ఏకంగా 90,000 మంది భారతీయుల కలలు తీవ్రంగా ప్రభావితం అయ్యే నిర్ణయం వెలువడటం ఖాయమైంది. అమెరికాలో పనిచేసే భారత వృత్తి నిపుణులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగులనుంది. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతిని తొలిగించేందుకు ప్రస్తుతమున్న నిబంధనల్లో మార్పులు చేస్తూ రూపొందించిన ప్రతిపాదనల ప్రక్రియ రెండో దశకు చేరింది. ఇటీవల జారీ చేసిన నోటీసులకు కొనసాగింపుగా..రెండో ప్రక్రియ మొదలుపెట్టినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.
హెచ్1 బీ వీసా ఉన్నవారి జీవిత భాగస్వాములు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయడానికి వీలుగా హెచ్4 వీసాను జారీ చేస్తున్నారు. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ మేరకు వెసులుబాటు చట్టం తెచ్చారు. ఇలా వీసా పొందిన వారిలో భారత్‌కు చెందిన నిపుణులే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 90,000 మంది భారతీయులకి హెచ్4 వీసా ఉన్నట్లు అంచనా. ఇలాంటి కీలకమైన అంశంలో మొండిగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్దికాలం క్రితం ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి తన కార్యాలయానికి తెప్పించుకున్నారు.
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌కు అందిన ఈ ప్రతిపాదనలపై రెండో ప్రక్రియ పూర్తవడంతో వాటి ఆమోదం పొందనున్నాయి. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే - అమలు నిర్ణయాన్ని వెల్లడిస్తూ...ఫెడరల్ రిజిస్ట్రిలో ప్రచురిస్తారు. అయితే, ఈ నూతన ప్రతిపాదనలపై 30-60 రోజుల వరకు ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. అనంతరం చట్టం చేస్తారు. ఈ ప్రక్రియ అంతటికి ఏడాది పట్టవచ్చని సమాచారం. అయితే, ఈ నిర్ణయం వెలువడటం ఖాయమని పలువురు ఆందోళన చెందుతున్నారు. అమల్లోకి వవస్తే భారత్‌కు భారీ దెబ్బేనని పేర్కొంటున్నారు.