Begin typing your search above and press return to search.
నాలుగేళ్లలో హెచ్1 బీ వీసాల అప్రూవల్ రేటు 22 శాతం తగ్గిపోయింది
By: Tupaki Desk | 13 Jun 2019 9:35 AM GMTహెచ్ 1బీ వీసాల విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది. దరఖాస్తుల స్క్రూటినీని పక్కాగా చేపడుతూ ఏమాత్రం తేడా ఉన్నా తిరస్కరిస్తోంది. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ గణాంకాల ప్రకారం 2018 అక్టోబరు 1 నుంచి 2019 మార్చి 31 మధ్య చాలా దరఖాస్తులకు కంపెనీల స్పాన్సరింగ్ ఉన్నట్లుగా తేలింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా విశ్లేషణ ప్రకారం 48 శాతం హెచ్1 బీ వీసాల్లో రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్(ఆర్ ఎఫ్ ఈ) ఉన్నాయని.. ఇది అంతకుముందు ఏడాదితో పోల్చితే 1 శాతం అధికమని తేలింది. 2018 అక్టోబరు 1 నుంచి 2019 మార్చి 31 కాలంలో 95,050 ఆర్ ఎఫ్ ఈలు గుర్తించగా...2017 అక్టోబరు 1 నుంచి 2018 మార్చి 31 మధ్య 88,630 ఆర్ ఎఫ్ ఈ గుర్తించారు.
దేశాలవారీగా డాటా అందుబాటులో లేనప్పటికీ ఇనిషియల్ హెచ్1 బీ వీసాల్లో 60 శాతానికి పైగా భారతీయులకు కేటాయించారు. హెచ్1 బీ ఎక్స్ టెన్షన్స్ అంతకంటే ఎక్కువే జారీ అయ్యుంటాయి.అయితే.. హెచ్1 బీ వీసాల అప్రూవల్ రేటు 2018 అక్టోబరు 2019 మార్చి మధ్య భారీగా తగ్గిపోయింది. అంతకుముందు సంవత్సరంలో ఇదే పీరియడ్ లో అప్రూవల్ రేటు 62.3 శాతం కాగా.. ఈసారి 60.5 మాత్రమే. దీంతో స్క్రూటినీ కఠినంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అప్రూవల్ రేటు 2 శాతం మేర తగ్గడం స్క్రూటినీ కఠినతరం చేశారనడానికి సూచన అని చెబుతున్నారు.
2015లో ఈ అప్రూవల్ రేటు 83 శాతంగా ఉండేది. 2017లో అది 74 శాతానికి తగ్గింది. 2018లో 62.3... 2019 నాటికి 60.5 శాతానికి పడిపోయింది. అంటే.. గత నాలుగేళ్లలోనే 20 శాతానికి పైగా అప్రూవల్ రేటు తగ్గిపోయిందని అర్థమవుతోంది.