Begin typing your search above and press return to search.
భారత టెక్కీలకు ఊరట
By: Tupaki Desk | 31 July 2021 1:30 AM GMTఅమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ వచ్చాక విదేశీయుల విషయంలో ఊరటకల్పించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదివరకు అధ్యక్షుడు ట్రంప్ అమెరికన్స్ ఫస్ట్ అంటూ విదేశీయులపై కఠిన ఆంక్షలు విధించగా.. జోబైడెన్ మాత్రం అన్నీ మినహాయింపులు ఇస్తున్నారు.
హెచ్1బీ వీసాలకు ప్రస్తుతం డిమాండ్ బాగా ఉంది. ప్రతిఏటా అమెరికా 85వేల కొత్త హెచ్1బీ వీసాలను జారీ చేస్తుంది. వృత్తి నైపుణ్య నిపుణులు వీటిని సద్వినియోగం చేసుకుంటారు. వీరిలో అధిక సంఖ్యలో చైనా, భారత్ వంటి దేశాలకు చెందిన ఐటీ సంస్థలకు చెందిన నిపుణులే ఉంటున్నారు. వీసాల జారీ విషయంలో లాటరీ విధానాన్నే కొనసాగించాలని జోబైడెన్ ప్రభుత్వం నిర్ణయించడంతో మొదటి రౌండ్ లాటరీ విధానాన్ని పూర్తి చేశారు.
తాజాగా అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ తీపికబురునందించింది. ఈ వార్త ఒక రకంగా భారత టెక్కీలకు ఊరటనిచ్చేదే.. రెండో రౌండ్ లాటరీ పద్ధతిలో హెచ్1బీ వీసాలు జారీ చేయనున్నట్లు యూఎస్ సిటీజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది.
మొదటి రౌండ్ లాటరీ విధానంలో అనుకున్న స్థాయిలో ఎంపికలు జరగకపోవడంతో రెండో రౌండ్ లాటరీ నిర్వహిస్తున్నట్లు యూఎస్సీ ఐఎస్ ప్రకటించింది.ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్న పిటీషన్ ఫైలింగ్ ప్రక్రియ నవంబర్ 3తో ముగియనుంది.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2021 అక్టోబర్ 1-2022 సెప్టెంబర్ 30వరకు హెచ్1బీ వీసాలకు దరకాస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో కొందరినీ హెచ్1బీ వీసాలకు మొదటి లాటరీలో ఎంపిక చేశారు. ప్రస్తుతం రెండో రౌండ్ లాటరీ ద్వారా హెచ్1బీ వీసాలు జారీ చేస్తామన్న ప్రకటనతో స్టెమ్, ఓపీటీ విద్యార్థులకు ఊరట లభించినట్టైంది.