Begin typing your search above and press return to search.

ఐఎస్ లిస్టులో అమెరికా అధికారులు

By:  Tupaki Desk   |   24 Sep 2016 4:31 PM GMT
ఐఎస్ లిస్టులో అమెరికా అధికారులు
X
ప్ర‌పంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తోన్న ఐఎస్ ఐఎస్ ఉగ్ర‌వాద సంస్థ ఇప్పుడ అమెరికాకు దిమ్మ‌తిరిగే రీతిలో టార్గెట్ పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. ఐఎస్ ఐఎస్ టార్గెట్‌ లో ప్ర‌పంచ దేశాల్లోనే అమెరికా ఫ‌స్ట్ ప్లేస్‌ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ జాబితాలో అమెరికా ఫ‌స్ట్ ప్లేస్‌ లో ఉంటే రెండో ప్లేస్‌ లో ఫ్రాన్స్‌ - మూడో ప్లేస్‌ లో ఆస్ట్రేలియా ఉన్నాయి. అమెరికాకు ఎప్ప‌టి నుంచో వార్నింగ్‌ లు ఇస్తూ వ‌స్తోన్న ఐఎస్ ఇప్పుడు అమెరికాలో ముఖ్య విభాగాల‌కు చెందిన 1300 మంది అధికారుల‌ను టార్గెట్ చేసి వారిని చంపేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఉన్న‌ట్టు స‌మాచారం.

అమెరికాలోని మిట‌రీతో పాటు ప్ర‌భుత్వంలోని కీల‌క విభాగాల‌కు చెందిన మొత్తం 1300 మంది అధికారుల పేర్లు - వారి వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను ఓ యువ‌కుడు ఐఎస్‌ కు అంద‌జేశాడు. మలేషియాలోని కోసోవో నగరానికి చెందిన ఫెరిజీ అనే 20 ఏళ్ల యువకుడు అమెరికా అధికారిక వెబ్‌ సైట్లను హ్యాక్ చేసి ప్రముఖుల ఈ మెయిల్ అడ్రస్‌ లు - పాస్‌ వర్డ్‌ లు - ఫోన్ నెంబర్లను - వారి వివరాలను సేకరించాడు. వాటిని ఐఎస్ ఐఎస్‌ కు చేరవేశాడు.

దీంతో ఇప్పుడు వీరంద‌రూ ఐఎస్ టార్గెట్ లిస్టులో ఉన్నారు. ఈ హిట్ లిస్ట్‌ ను ఐఎస్ ఆన్‌ లైన్‌ లో కూడా పెట్టింది. ఈ 1300 మంది ఫోన్ నెంబ‌ర్లు - వారు నివాసం ఉండే ప్రాంతాలు - వ్య‌క్తిగ‌త పాస్‌ వ‌ర్డ్‌లు సైతం ఐఎస్ వ‌ద్ద ఉన్నాయి. ఈ విష‌యం అమెరికాలో పెను ప్ర‌కంప‌న‌లు రేప‌డంతో వారు దీనిపై సీరియ‌స్‌ గా దృష్టి సారించారు. ఈ వివ‌రాలు ఎలా హ్యాక్ అయ్యాయ‌ని వారు ఆరాతీయ‌గా మ‌లేషియాలోని ఫెరిజీ దోషిగా తేలాడు.

అమెరికా ఇన్వెస్ట్‌ గేష‌న్ అధికారుల విచార‌ణ‌లో ఫెరిజీ తానే ఈ ప‌ని చేసిన‌ట్టు కూడా ఒప్పుకున్నాడు. ఇక కోర్టులో సైతం ఫెరిజీ అమెరిక‌న్ల స‌మాచారాన్ని తాను ఐఎస్‌కు ఇచ్చి తాను చాలా త‌ప్పు చేశాన‌ని కూడా ఒప్పుకున్నాడు. ఫెరిజీ కేసును విచారించిన యూఎస్ డిస్ట్రిక్ట్ న్యాయ‌మూర్తి లీనియో బ్రిన్కెమా అత‌డికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు.