Begin typing your search above and press return to search.
పాక్ దేశభక్తి గీతాలు...పైలట్లకు నరకం!
By: Tupaki Desk | 4 Oct 2016 9:03 AM GMTదేశభక్తి గీతాలు అంటే ఆ దేశపౌరులను మేల్కొలిపేవిగా - క్రమశిక్షణతో కూడిన కర్తవ్యాన్ని గుర్తుచేసేవిగా - ఎంతో గౌరవప్రధమైన స్థానంలో ఉంటాయి. కానీ వాటిని ఇతరదేశస్తులను ఇబ్బందిపెట్టడానికి, చికాకు కల్గించడానికి వాడేవారు ఎవరైనా ఉంటారా?... ఉంటారు అని చెబుతున్నారు ఇండియన్ పైలట్స్. అవును భారత పైలెట్లు "దిల్ దిల్ పాకిస్థాన్" - "జాన్ జాన్ పాకిస్థాన్" వంటి పాక్ దేశభక్తి గీతాలు వినలేక నరకం చూస్తున్నారట. పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని విమానాశ్రయాల్లో విమానాలు దించాలంటేనే వారంతా భయపడుతున్నారు.
వివరాళ్లోకి వస్తే... పాకిస్థాన్ విమానాశ్రయాల్లో విమానాలు దించాలంటేనే హడలెత్తిపోతున్నారు భారత పైలెట్లు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే... పాకిస్థాన్ కు చెందిన హ్యాకర్లంట. అవును - పాకిస్థాన్ కు చెందిన హ్యాకర్లు విమానాశ్రయాల్లోని ఏటీసీ ని హ్యాక్ చేసి పైలట్లకు పాటలు వినిపిస్తున్నారట. జమ్మూకశ్మీర్ లోని విమానాలు ల్యాండింగ్ చేసే సమయంలో తొలుత పైలెట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంభాషిస్తారు. ఆ ఏటీసీ నుంచి క్లియరెన్స్ తీసుకున్నాకే పైలట్లు విమానాన్ని దించుతారు. సరిగ్గా అనుమతి కోసం పైలెట్లు ఏటీసీని సంప్రదించే సమయంలోనే పాక్ కు చెందిన హ్యాకర్లు వారి ఫ్రీక్వెన్సీని హ్యాక్ చేస్తున్నారట. హ్యాక్ చేసిన వెంటనే ఇండియన్ ఫైలట్లకు పాక్ కు చెందిన దేశభక్తి గీతాలు వినిపిస్తున్నారంట.
ఇలా పాక్ దేశభక్తి గీతాలను కాక్ పీట్ లో వినాల్సి వస్తుందని, అది నరకంగా ఉండటంతోపాటు పై అధికారులు ఎలా స్పందిస్తారో కూడా అర్ధంకానీ పరిస్థితి నెలకొందని భారత పైలట్లు వాపోతున్నారట. దేశభక్తి గీతాలను సైతం శత్రువుపై పగ తీర్చుకునే ఒక ఆయుధంగా పాకిస్థాన్ ఉపయోగించుకుంటోందని ఈ నరకం అనుభవించిన భారత పైలట్లు చెప్తున్నారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/