Begin typing your search above and press return to search.
లండన్ నైట్ క్లబ్ లో యాసిడ్ అటాక్..టెన్షన్
By: Tupaki Desk | 17 April 2017 1:41 PM GMTఉగ్రవాదుల టార్గెట్ లో నైట్ క్లబ్ లు టాప్ ప్లేస్ లో నిలుస్తున్నట్లు కనిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనతో బ‌్రిటన్ రాజధాని లండన్ ఉలిక్కి పడింది. నైట్ క్లబ్ లో జరిగిన యాసిడ్ దాడిలో 12 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈస్ట్ లండన్ లోని మాంగిల్ క్లబ్ లో సోమవారం తెల్లవారుఝామున ఈ దాడి జరిగిందని లండన్ ఫైర్ బ్రిగేడ్ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో క్లబ్ లో 600 మంది వరకు ఉన్నట్లు ఆయన చెప్పారు. గాయపడిన వారికి అక్కడికక్కడే ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని, ఇది ఉగ్ర సంబంధ దాడి కూడా కాదని పోలీసులు స్పష్టంచేశారు.
మాంగిల్ నైట్ క్లబ్ లో అర్ధరాత్రి 12.10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులకు ఎవరో సమాచారమిచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు.
కాగా, ఈ మధ్యకాలంలో లండన్ లో యాసిడ్ దాడులు పెరిగిపోతున్నాయి. 2010 నుంచి ఇప్పటివరకు 1800కుపైగా యాసిడ్ దాడులు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2016లో 454 నేరాల్లో యాసిడ్ వాడినట్లు పోలీసులు తెలిపారు. కత్తులు - కటార్లు పట్టుకొని తిరిగే క్రిమినల్ గ్యాంగ్స్ ఇప్పుడు యాసిడ్ వైపు మొగ్గు చూపిస్తుండటం వల్లే ఇలాంటి దాడులు పెరిగిపోతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/